మొబైల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవంటూ..

|

Aug 02, 2021 | 9:58 AM

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అనేక పెద్ద కంపెనీలు వ్యక్తిగత డేటా షేరింగ్, వినియోగదారుల గోప్యత విషయంలో పలు వివాదాలు సైతం ఎడుర్కున్నాయి..

మొబైల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవంటూ..
Hacking
Follow us on

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అనేక పెద్ద కంపెనీలు వ్యక్తిగత డేటా షేరింగ్, వినియోగదారుల గోప్యత విషయంలో పలు వివాదాలు సైతం ఎడుర్కున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మొబైల్‌ను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మొబైల్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ కేటుగాళ్ళు ఎప్పుడైనా హ్యాక్ చేయవచ్చు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మొబైల్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆపిల్ సాఫ్ట్‌వేర్ ఎకో సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని లోపాల గురించి ప్రభుత్వ నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సిఈఆర్‌టి-ఇన్’ సాధారణ ప్రజలను హెచ్చరించింది.

ప్రభుత్వ హెచ్చరికను నిర్లక్ష్యం చేయవద్దు…

కేంద్రం చేసిన హెచ్చరికను అన్ని రకాల మొబైల్ వినియోగదారులు విస్మరించవద్దని టెక్ నిపుణులు అంటున్నారు. మొబైల్ కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్‌లోని లోపాల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ మొబైల్ లేదా పరికరాన్ని హ్యాక్ చేయవచ్చు. దాని నుంచి తప్పించుకోవాలంటే.. ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్ మొబైల్ వినియోగదారులు తమ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Android వినియోగదారులకు సలహా.?

ఆండ్రాయిడ్ మొబైల్స్, డివైస్‌లలోని సిగ్నల్ అప్లికేషన్‌లో లోపాన్ని CERT-In కనిపెట్టింది. దీని వల్ల కొన్ని పిక్చర్స్ ఆటోమేటిక్‌గా పంపబడుతున్నాయి. ఈ విధంగా వినియోగదారుల వ్యక్తిగత ఫోటోలు లీక్ చేయబడతాయి. అంతేకాకుండా వారి గోప్యతకు ప్రమాదం వాటిల్లవచ్చు. ఈ నేపధ్యంలోనే ఆండ్రాయిడ్‌ యూజర్లు సిగ్నల్ యాప్ 5.17.3 లేటెస్ట్ వెర్షన్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది.

అటు విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న లోపాన్ని కూడా CERT-In కనుగొంది. దీని ద్వారా కేటుగాళ్లు మీ అకౌంట్ పాస్‌వర్డ్‌, ఒరిజినల్ ఇన్‌స్టాలేషన్ పాస్‌వర్డ్‌లను సైతం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ iOS, iPadOSలో ఒక లోపాన్ని గుర్తించింది. దీని కారణంగా హ్యాకర్లు మీ డివైస్‌లు, మొబైల్స్‌ను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. అందువల్ల వెంటనే తమ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను వెంటనే చేయాలని వినియోగదారులను ఆపిల్ సంస్థ సూచించింది.