ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీలో కలిశారు. సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సమావేశ వివరాలు సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాము భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో సాంకేతికపరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచాయ్ ట్వీట్ చేశారు: “ఈరోజు జరిగిన గొప్ప సమావేశానికి ధన్యవాదాలు PM @narendramodi. మీ నాయకత్వంలో సాంకేతిక మార్పుల వేగవంతమైన వేగాన్ని చూడడానికి స్ఫూర్తినిస్తోంది. మా బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి , భారతదేశం G20 అధ్యక్ష పదవికి మద్దతుగా ముందుకు సాగడానికి ఎదురుచూస్తున్నాం. అందరికీ పని చేసే ఓపెన్, కనెక్ట్ చేయబడిన ఇంటర్నెట్.”
Thank you for a great meeting today PM @narendramodi. Inspiring to see the rapid pace of technological change under your leadership. Look forward to continuing our strong partnership and supporting India’s G20 presidency to advance an open, connected internet that works for all. pic.twitter.com/eEOHvGwbqO
— Sundar Pichai (@sundarpichai) December 19, 2022
గూగుల్ ఫర్ ఇండియా 8వ ఎడిషన్‌కు హాజరయ్యేందుకు భారత్ వచ్చిన సుందర్ పిచాయ్ సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిశారు. ఈ సమయంలో, భారతదేశంలో AI, AI ఆధారిత పరిష్కారాల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన సంభాషణలో పిచాయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నదాన్ని సృష్టించడం చాలా సులభం, ఇది భారతదేశానికి ఉన్న అవకాశం. మేము ప్రస్తుతం స్థూల-ఆర్థిక పరిస్థితిలో పనిచేస్తున్నప్పటికీ, ప్రతి క్షణం స్టార్టప్‌కు మంచి క్షణమే.
మరోవైపు, సుందర్ పిచాయ్‌ను.. భారతీయుల ప్రతిభకు చిహ్నంగా అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్లో సుందర్‌తో భేటీ అయిన రాష్ట్రపతి ముర్ము.. భారత్‌లో ప్రజలందరూ డిజిటల్ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని ఆయనకు పిలుపునిచ్చారు.
గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చారు సుందర్ పిచాయ్. స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారత స్టార్టప్‌లలో 300 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు గూగుల్ ఇదివరకు ప్రకటించింది. ఇందులో నాలుగో వంతు మహిళలు నాయకత్వం వహిస్తున్న స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం