Train Accident : రెండు గూడ్స్ రెళ్లు ఢీ.. ఇంజిన్ బోల్తా.. ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు..

|

Jun 02, 2024 | 11:52 AM

ప్యాసింజర్ రైలులో ఇంజన్ బోల్తా పడి ఇరుక్కుపోయింది. దీంతో సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలు కూడా దెబ్బతింది. ప్రమాదం తర్వాత, సమ్మర్‌ స్పెషల్‌ ట్రైయిన్‌ను రాజ్‌పురాకు రెండవ ఇంజన్‌ను అమర్చారు. ప్రస్తుతం ట్రాక్‌ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రైల్వే ఉద్యోగులు అక్కడికక్కడే ట్రాక్ మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Train Accident : రెండు గూడ్స్ రెళ్లు ఢీ.. ఇంజిన్ బోల్తా.. ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు..
Punjab Train Accident
Follow us on

పంజాబ్‌లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు రైల్వే గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. పంజాబ్‌లోని సిర్హింద్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో తెల్లవారుజామున 3:30 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత గూడ్స్ రైలు ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లకు గాయాలయ్యాయి. ఇద్దరు లోకో పైలట్లను ఆసుపత్రిలో చేర్చారు. వీరిని శ్రీ ఫతేగర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి.

గూడ్స్ రైళ్ల కోసం నిర్మించిన డిఎఫ్‌సిసి ట్రాక్‌పై బొగ్గుతో కూడిన రెండు గూడ్స్ రైళ్లు ఆగి ఉన్నాయి. ఈ గూడ్స్ రైళ్లు రోపర్ వైపు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గూడ్స్ రైలు ఇంజిన్ విరిగిపోయి మరో రైలును ఢీకొట్టింది. అంబాలా నుంచి జమ్ముతావి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఇంజన్ బోల్తా పడి ఇరుక్కుపోయింది. దీంతో సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలు కూడా దెబ్బతింది. ప్రమాదం తర్వాత, సమ్మర్‌ స్పెషల్‌ ట్రైయిన్‌ను రాజ్‌పురాకు రెండవ ఇంజన్‌ను అమర్చారు. ప్రస్తుతం ట్రాక్‌ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రైల్వే ఉద్యోగులు అక్కడికక్కడే ట్రాక్ మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్‌లు ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా వాసులు. వారిని వికాస్ కుమార్, హిమాన్షు కుమార్‌లుగా గుర్తించారు. ఇంజిన్ అద్దాలు పగలగొట్టి లోకో పైలట్‌లిద్దరినీ బయటకు తీశారు. ఆ తర్వాత అంబులెన్స్ సహాయంతో సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి రెఫర్ చేశారు.

సిర్హింద్ GRP పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రతన్‌లాల్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రమాదం కారణంగా అంబాలా నుంచి లూథియానా వరకు రైలు మార్గం నిలిచిపోయింది. రైల్వే ఉద్యోగుల ద్వారా ట్రాక్‌ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అంబాలా డివిజన్ డీఆర్‌ఎంతో సహా పలువురు రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..