India controls Medicine Price: అన్ని వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న వేళ.. భారత ప్రభుత్వం దేశ ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా ప్రజలకు అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. ఇంతకీ కేంద్ర సర్కార్ ఏ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత కోవిడ్ కాలంలో 100లో 90 మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏదో రకమైన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. చికిత్స పొందుతున్నారు. కంటిన్యూగా మెడిసిన్స్ తీసుకుంటున్నారు. దాంతో తాము కష్టపడి సంపాదించిన సొమ్మంతా మెడిసిన్స్, చికిత్స కోసమే ఖర్చైపోతుంది. మెడిసిన్స్ ధరలు భారీగా ఉండటం కూడా ప్రజలను మరింత అవస్థలపాలు చేస్తోంది. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు ఎదుర్కొనే వారు నిత్యం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అయితే, ఈ మెడిస్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులకు ఆర్థికంగా భారం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ధరల నియంత్రణ జాబితాలో మరో 19 కీలక ఔషధాలను చేర్చింది. ఇందులో ఇందులో మధుమేహం, గుండె జబ్బులు మరియు రక్తపోటు వంటి జబ్బులకు వాడే మెడిసిన్స్ ఉన్నాయి. చాలా ఔషధాలు ఇప్పటికే ధరల నియంత్రణ జాబితాలో ఉన్నాయి. గుండె జబ్బులకు ఉపయోగించే అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ ధర రూ. 16.7 గా ఉంది. పారాసెటమాల్, ఫినైల్ఫైన్, కెఫిన్ మిశ్రమం ధర ఇప్పుడు 3.21 గా ఉంది. అయితే, వీటికి జీఎస్టీ అదనంగా ఉండనుంది.
Also read:
Russia Ukraine War: మూడో ప్రపంచం యుద్ధం అనివార్యమా? వస్తే ఏ దేశం ఎటువైపు.. భారత్ పరిస్థితి ఏంటి?