Viral Video: కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.. చిన్న విషయానికి కూడా శివాలెత్తిపోతుంటారు.. కోపంతో ఏం చేస్తారో కూడా మర్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంత మంది ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆ మహిళను సమర్థిస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో మహిళ ఏంచేసిందంటే.. నిజానికి మహిళలు చాలా సహనంతో ఉంటారు అంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఆ సహనాన్ని కోల్పోయింది. ఓ డెలివరీ బాయ్ చేసిన పనికి రోడ్డు పైనే చెప్పుతో కొడుతూ హల్ చల్ చేసింది. ఇంతకు అతడు చేసిన తప్పేంటంటే.. మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లాలోని రస్సెల్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రాంగ్ రూట్ లో వచ్చి ఓ మహిళ స్కూటీని ఢీ కొట్టాడు.
అంతే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ నడి రోడ్డుమీద అందరు చూస్తుండగా.. అతడిని నోటికొచ్చినట్టు తిడుతూ.. తన కాలి షూ తో కొట్టింది. చుట్టూ ఉన్నవారు వాదిస్తున్నా ఆమె వినిపించుకోకుండా అతడిని విపరీతంగా కొట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ వుండిపోయారే కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. అయితే ఆమె ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిందని స్థానికులు చెప్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓంటీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్‌పిఎస్ బాఘేల్ తెలిపారు. ఈ ఘటనపై ఏదైనా ఫిర్యాదు అందితే సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని బఘేల్ తెలిపారు. అయితే ఈ వీడియోలో మహిళ అతడిని కొట్టడాన్ని కొందరు వెతిరేకిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :