
భారత-చైనా దళాల మధ్య భీకర ఘర్షణ జరిగిన గాల్వన్ లోయలో మెల్లగా ప్రశాంతత ఏర్పడనుందా ? పరిస్థితి చల్లబడనుందా ? ఆ ప్రాంతంలో చైనా సైనికులు తమ మిలిటరీ వాహనాలతో బాటు కొంతమేర వెనక్కి వెళ్లినట్టు సమాచారం ! దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈ ఉపసంహరణ జరిగినట్టు సైనిక వర్గాలు సూత్రప్రాయంగా తెలిపాయి. ఉభయ దేశాల మధ్య ఉన్నత స్థాయి దౌత్య, సైనికపరమైన చర్చలు వరుసగా జరిగిన నేపథ్యంలో.. చైనా సైనికులు కొంత వెనక్కి మళ్లినట్టు భావిస్తున్నారు. డీ-ఎస్కలేషన్ పై ఈ నెల 6 న, మళ్ళీ 17 న, తిరిగి 22 న రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సేనలు వెనక్కి మళ్లడమన్నది ఒక్క గాల్వన్ లోయకే పరిమితమైంది.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.