G20 Meeting: తొలిసారిగా అంతర్జాతీయ సదస్సులో ‘భార‌త్‌’.. మోదీ ప్రసంగంతో జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం..

|

Sep 09, 2023 | 12:17 PM

జి20 సదస్సు తొలిరోజు తొలి సెషన్‌ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. మొరాకో భూకంపంపై మొదట మాట్లాడారు ప్రధాని మోదీ. అక్కడ సంభవించిన భూకంపంలో సుమారు 300 మంది మరణించారు. ఈ దుఃఖ సమయంలో ప్రపంచం మొత్తం మొరాకోతో ఉందని భరోసా కల్పించారు. జి20 గ్రూపులో ఆఫ్రికన్ యూనియన్ అధికారికంగా చేరుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

G20 Meeting: తొలిసారిగా అంతర్జాతీయ సదస్సులో భార‌త్‌.. మోదీ ప్రసంగంతో జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం..
G 20 Summit
Follow us on

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జీ-20 సదస్సు ప్రారంభమైంది. భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు భారత్‌ మండపం వేదికగా అట్టహాసంగా కొనసాగుతోంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తన ప్రసంగంతో మోదీ సదస్సును ప్రారంభించారు. జీ20 సదస్సు వేదికగా భారత్‌ వెలిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్ గా మార్చేన సంగతి తెలిసిందే. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే జీ 20 సదస్సుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి, ప్రధానిలకు పంపిన ఒక ఆహ్వాన పత్రం భారత్‌ పేరుతో పంపించారు. ఇక ఇప్పుడు తాజాగా జీ20 సదస్సులో ఎక్కడ చూసిన భారత్‌ అనే పేరు ప్రత్యక్షమైంది. ప్రధాని ప్రసంగించిన పోడియం, మైకులకు కూడా ముందు భాగంలో భారత్‌ అని కనిపించింది. జీ20 ప్ర‌తినిధుల‌ను ఉద్దేశిస్తూ ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగిస్తున్న చైర్ వ‌ద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌పై భార‌త్ అని రాసి ఉంది. మోదీ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తూ.. భార‌త్ మిమ్మ‌ల్ని స్వాగ‌తిస్తోంద‌ని ప్రసంగించారు. ఓ అంత‌ర్జాతీయ మీటింగ్‌లో మ‌న దేశాన్ని ఇండియాకు బదులుగా భార‌త్ అని రాయ‌డం ఇదే తొలిసారి.

జి20 సదస్సు తొలిరోజు తొలి సెషన్‌ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. మొరాకో భూకంపంపై మొదట మాట్లాడారు ప్రధాని మోదీ. అక్కడ సంభవించిన భూకంపంలో సుమారు 300 మంది మరణించారు. ఈ దుఃఖ సమయంలో ప్రపంచం మొత్తం మొరాకోతో ఉందని భరోసా కల్పించారు. జి20 గ్రూపులో ఆఫ్రికన్ యూనియన్ అధికారికంగా చేరుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. యూనియన్ అధ్యక్షుడిని కౌగిలించుకుని అభినందనలు తెలిపారు. మీ అందరి అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్ నేటి నుంచి జీ20లో శాశ్వత సభ్యత్వం తీసుకోబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రకటనతో నేతలంతా చప్పట్లు కొట్టారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ అజాలి అసోమానిని వెంట తీసుకువెళ్లారు మరియు పిఎం మోడీ అతనిని ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరిస్తూ కూర్చోబెట్టారు.

G20 కార్యకలాపాలను ప్రారంభించే ముందు మొరాకోలో భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై తమ సంతాపాన్ని తెలియజేశారు ప్రధాని మోదీ. మొరాకో భూకంపంలో గాయపడిన వారందరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోదీ తర్వాత ప్రపంచ నేతలంతా ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

గ్లోబల్ ట్రస్ట్ లోటును ఒక ట్రస్ట్‌గా మార్చాలని జి20 అధ్యక్షుడిగా భారతదేశం మొత్తం ప్రపంచానికి పిలుపునిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇది. అందువల్ల, సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గనిర్దేశం చేయగలదన్నారు మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..