Mithun Chakraborty: మొదట నక్సలైట్.. ఆ తర్వాత బాలీవుడ్ ‘డిస్కో డాన్సర్’ ఇప్పుడు బీజేపీలో.. ఇవాళ అతని పుట్టిన రోజు..

Mithun Chakraborty Birthday: నటుడు మిథున్ చక్రవర్తి రాజకీయ జీవితం అల్ట్రా-లెఫ్ట్ నుంచి సెంటర్-లెఫ్ట్, సెంట్రరిస్ట్, ఇప్పుడు రైట్-వింగ్‌గా మారింది. ఇవాళ మిథున్ చక్రవర్తి 72వ పుట్టినరోజు. మిథున్ దా 90లలో నంబర్ వన్ స్టార్..

Mithun Chakraborty: మొదట నక్సలైట్.. ఆ తర్వాత బాలీవుడ్ 'డిస్కో డాన్సర్' ఇప్పుడు బీజేపీలో.. ఇవాళ అతని పుట్టిన రోజు..
Mithun Chakraborty Birthday
Follow us

|

Updated on: Jun 16, 2022 | 11:06 AM

ఒక్కప్పుడు తుపాకీ పట్టి  “బంగ్లార్ చెలే” (బెంగాల్ స్వంతం) జీవితం పోరాటం.. ఆ తర్వాత బాలీవుడ్ బ్రేక్ డ్యాన్స్ నేర్పాడు.. ఇలా నటుడు మిథున్ చక్రవర్తి రాజకీయ జీవితం అల్ట్రా-లెఫ్ట్ నుంచి సెంటర్-లెఫ్ట్, సెంట్రరిస్ట్, ఇప్పుడు రైట్-వింగ్‌గా మారింది. ఇవాళ మిథున్ చక్రవర్తి 72వ పుట్టినరోజు. మిథున్ దా 90లలో నంబర్ వన్ స్టార్. బాలీవుడ్‌కి ఎన్నో గొప్ప చిత్రాలను అందించారు. మిథున్ 1976లో మృగయ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ డిస్కో డ్యాన్సర్ సినిమాతో అతనికి పాపులారిటీ వచ్చింది. ఈ చిత్రంలోని ‘ఐ యామ్‌ డిస్కో డ్యాన్సర్‌’ పాట ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతోంది. భారతదేశంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. మిథున్ దా ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కానీ అతను తన కృషి, సామర్థ్యం కారణంగా నేడు కోట్లకు యజమాని. మిథున్ ఒకప్పుడు నక్సలైట్. మిథున్ దా 1950 జూన్ 16న కలకత్తాలో జన్మించారు. B.Sc చదివిన తరువాత.. అతను పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాడు.

మిథున్ దా నక్సలైట్ల గ్రూప్‌లో చేరి నక్సలైట్‌గా మారాడు. జూలై 16, 1950న, దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించిన గౌరంగ, ఆ తర్వాత తనను తాను మిథున్‌గా మార్చుకున్నాడు, నక్సలైట్ ఉద్యమం స్థాపించబడిన తీవ్రవాద భావజాలంతో ఊగిసలాడారు. ఇతర వేలాది మంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే. 1960ల చివరలో నక్సల్ ప్రభావంతో పోరాటంలోకి దూకారు. కల్కత్తాలో నక్సలైట్ పోరాటం సాగుతున్న సమయంలో చారు మజుందార్‌తో కలిసి పనిచేశారు. అప్పటి బెంగాల్‌లో నక్సలైట్లపై పోలీసుల అణిచివేత కారణంగా మిథున్ అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది. కొంతకాలం పాటు న్యాయం నుంచి పరారీలో ఉన్నాడు. అతను నక్సలైట్ కావడాన్ని అతని కుటుంబం ఆందోళనకు గురైంది. అయితే, అతని సోదరుడు ప్రమాదంలో మరణించడం అతనిని కదిలించింది. ఆదర్శవంతమైన సమాజ ఆవిర్భావానికి దారితీసే సాయుధ పోరాటం ఒక భ్రమ కలిగించే భావనను ప్రశ్నించేలా చేసింది.

మిథున్ సోదరుడు ప్రమాదంలో మరణించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన మిథున్ వెనుదిరిగి చూడలేదు. అయితే మిథున్ దా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చిన సమయం వచ్చింది. 1993 నుంచి 1998 వరకు అతని వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే కంటిన్యూగా ఫ్లాప్ సినిమాలు ఇచ్చినా అది మిథున్ స్టార్‌డమ్‌పై ప్రభావం చూపలేదు. ఈ కాలంలో కూడా మిథున్ వరుసగా 12 సినిమాలకు సైన్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘జగ్ ఉతా ఇన్సాన్’ సినిమా సెట్స్‌లో యోగితా బాలిని మిథున్ దా కలిశాడు. అలాంటి పరిస్థితుల్లో షూటింగ్ సమయంలో ఇద్దరూ దగ్గరయ్యారు. శ్రీదేవిని తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మిథున్ చక్రవర్తి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ శ్రీదేవి మాత్రం మిథున్ తన భార్యకు విడాకులు ఇచ్చి తన వద్దకు రావాలని కోరుకుంది. కానీ యోగిత కోసం ఆమె ఈ సంబంధాన్ని తెంచుకున్నారు. ప్రస్తుతం యోగిత, మిథున్ దంపతులకు నలుగురు పిల్లలు. వీరికి ముగ్గురు కుమారులు మిమో, నమషి, ఉస్మాయ్ ఉన్నారు మరియు వారు వారి కుమార్తె దిషానిని దత్తత తీసుకున్నారు. మిథున్ చక్రవర్తి నికర విలువ 282 కోట్లు. నటనతో పాటు, అతను వ్యాపారం, హోస్ట్‌గా షోలు మరియు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి కూడా చాలా సంపాదిస్తున్నారు.

రాజకీయ జీవితం..

మిథున్-సుభాస్ బంధం 1986లో కలకత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వరద సహాయం కోసం నిధులు సేకరించేందుకు నిర్వహించబడిన హోప్ ’86 అనే పాట, నృత్య ప్రదర్శనను హోస్ట్ చేశారు. ఆ తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ తో కలిసి పని చేశారు. గత ఏడాది మార్చిలో రైట్ వింగ్‌లో చేరారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో