
తమిళనాట పార్టీ పెట్టడం ఒక ఎత్తయితే.. దాన్ని ‘అధికార పీఠం’ వరకు తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. బట్.. దీనికి పునాది వేసింది ముగ్గురు వ్యక్తులు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది అన్నాదురై అండ్ కరుణానిధి. వీరు సినిమాలను తమ ద్రావిడ భావజాల ప్రచారానికి ఆయుధాలుగా వాడుకున్నారు. సామాజిక మార్పును సినిమాల ద్వారా చూపించి ప్రజల మెదళ్లలోకి చొచ్చుకుపోయారు. ఆ రోజుల్లో దేశమంతా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి సమయంలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించేసిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ.. డీఎంకే. అలా స్వతంత్ర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అన్నాదురై. రాజకీయాల్లోకి రాకముందు రంగస్థల నాటక రచయితగా ఉన్నారు అన్నాదురై. ఇక ఆయన శిష్యుడిగా సినీ రచనలు చేస్తూ పదునైన సంభాషణలతో ప్రజల్ని ఆకట్టుకున్న నాయకుడు కరుణానిధి. అందుకే, అన్నాదురై చనిపోయినప్పుడు మరో ఆలోచనకు తావులేకుండా కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది ఆ పార్టీ. ఈ ఇద్దరి కంటే ఎక్కువ ప్రభావం చూసిన స్టార్.. ఎం.జి. రామచంద్రన్. గేమ్ ఛేంజర్, ట్రెండ్ సెట్టర్ అంటుంటారే.. ఆ పదాలు ఎంజీఆర్‌కు సరిగ్గా సరిపోతాయి. సినిమాల్లో ‘పేదల పెన్నిధి’గా ముద్ర వేయించుకుని, అన్నాడీఎంకే స్థాపించి 1977లో ముఖ్యమంత్రి అయ్యారు. చనిపోయే వరకు...