Manipur Conflict: అట్టుడుకుతున్న మణిపూర్.. మళ్లీ చెలరేగిన హింసాత్మక ఘటనలు

మణిపుర్‌లో కొన్ని రోజుల క్రితం మొదలైన అల్లర్లు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. శుక్రవారం రాత్రి చురాచంద్‌పుర్ జిల్లాలోని కన్వాగీ, అలాగే బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. అలాగే శనివారం ఉదయం కూడా ఈ ప్రాంతాల్లో అల్లర్లు జరిగినట్లు పోలీసులు, సైనికులు తెలిపారు.

Manipur Conflict: అట్టుడుకుతున్న మణిపూర్.. మళ్లీ చెలరేగిన హింసాత్మక ఘటనలు
Manipur

Updated on: Jun 17, 2023 | 4:19 PM

మణిపూర్‌లో కొన్ని రోజుల క్రితం మొదలైన అల్లర్లు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. శుక్రవారం రాత్రి చురాచంద్‌పుర్ జిల్లాలోని కన్వాగీ, అలాగే బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. అలాగే శనివారం ఉదయం కూడా ఈ ప్రాంతాల్లో అల్లర్లు జరిగినట్లు పోలీసులు, సైనికులు తెలిపారు. అలాగే అడ్వాన్స్ ఆసుపత్రి సమీపంలోని పలువురు దుండగులు కాల్పులు చేసేందుకు యత్నించినట్లు పలు నివేదికల్లో వెల్లడైంది. శుక్రవారం సాయంత్రం దాదాపు 1000 మంది దుండగులు విధ్వంసం చేసేందుకు యత్నించినట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న ఆర్‌ఏఎఫ్ సిబ్బంది.. దుండగులను తరిమేందుకు రబ్బర్ బుల్లేట్లు, టీయర్ గ్యాస్‌లను వినియోగించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

శుక్రవారం రాత్రి తొంగ్జూ ప్రాంతంలో దాదాపు 200 నుంచి 300 మంది దుండగులు స్థానిక ఎమ్మెల్యే ఇంటిని కూల్చేసేందుకు యత్నించారు. మణిపుర్ యూనివర్శిటీ దగ్గర్లో కూడా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇంఫాల్ దక్షిణ జిల్లాలోని ఇరింగ్‍బామ్‌లోని శుక్రవారం అర్థరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రద్ద దేవి నివాసాన్ని దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. వెంటనే ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దుండగులు చర్యలను అడ్డుకుని వారిని తరిమేశారు.

మణిపుర్‌లో ఇంతటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రధని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మణిపుర్ ప్రజలతో ప్రధాని మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదని మండిపడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌పై కూడా ప్రజలు విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. దాదాపు 1200 మంది దుండగులు కేంద్రమంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ ఇంటిని తగలబెట్టిన మరుసటి రోజే మళ్లీ ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా గత నెలలో మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఈ హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. శాంతి భద్రతలు కాపాడేందుకు అధికారులు కర్ఫ్యూలు విధించినప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..