Crime: నలుగురి ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం.. ఎవరూ లేరనుకుని వేగంగా కారు నడిపాడు.. చివరకు

|

Sep 10, 2022 | 4:28 PM

మహారాష్ట్రలోని (Maharashtra) నాగపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదే రూట్ లో వెళ్తున్న బైక్ లపై దూసుకెళ్లింది. నగరంలోని సక్కర్దార బ్రిడ్జిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన..

Crime: నలుగురి ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం.. ఎవరూ లేరనుకుని వేగంగా కారు నడిపాడు.. చివరకు
Accident
Follow us on

మహారాష్ట్రలోని (Maharashtra) నాగపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదే రూట్ లో వెళ్తున్న బైక్ లపై దూసుకెళ్లింది. నగరంలోని సక్కర్దార బ్రిడ్జిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

గణేశ్​అధావ్ తన ఫ్రెండ్ కారు తీసుకుని బుట్టిబోరినికి పయనమయ్యాడు. అర్ధరాత్రి కావడంతో రద్దీ తక్కువగానే ఉంటుందని భావించాడు. బ్రిడ్జ్​పై ఎవరూ లేరనుకుని కారు స్పీడ్ చేశాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను వరుసగా ఢీ కొట్టాడు. అందులో ఓ బైక్​పై ఒక వ్యక్తి, అతని తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. కారు ఢీ కొట్టడం వల్ల వారు వంతెనపై నుంచి కింద పడిపోయారు. ఆ నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు వినోద్ ఖపేకర్ (45), అతని తల్లి లక్ష్మీబాయి (65), అతని ఇద్దరు కుమారులు ఐదు, పదకొండేళ్ల వయస్సు ఉన్నారని, ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి