‘కేరళ టెంపుల్స్ లో 600 ఏనుగులను చంపారు… మీరేం చేశారు ?’ మేనకా గాంధీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 8:02 PM

కేరళ లోని మళప్పురంలో గర్భస్థ ఏనుగు మృతిపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. కేరళ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. మీ రాష్ట్రంలోని..

కేరళ టెంపుల్స్ లో 600 ఏనుగులను చంపారు... మీరేం చేశారు ? మేనకా గాంధీ
Follow us on

కేరళ లోని మళప్పురంలో గర్భస్థ ఏనుగు మృతిపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. కేరళ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. మీ రాష్ట్రంలోని ఆలయాల్లో దాదాపు 600 ఏనుగులను ఆహారం పెట్టకుండా వాటి కడుపు మాడ్చారని, వాటి కాళ్ళు విరగగొట్టి చిత్ర హింసలు పెట్టి వాటి మరణాలకు కారకులయ్యారని ఆమె ట్వీట్ చేశారు. కానీ మీ ప్రభుత్వం గానీ, వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ గానీ వారిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. మళప్పురంలో ఏనుగు మరణానికి ఆ రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శిని బాధ్యుడిని చేసి వెంటనే తొలగించాలని, ఈ శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేరళలో ఏనుగుల యజమానులు వాటిని బీమా చేయించి..ఆ సొమ్ము కోసం  ఆ తరువాత వాటిని నీటిలో ముంచి చంపుతారని, లేదా విష  పదార్థాలు ఇఛ్చి వాటి మృతికి కారకులవుతారని మేనక అన్నారు. మలప్పురం లో జంతు హింస ఎక్కువగా జరుగుతుంది. కిరాతకంగా వన్య ప్రాణులను చంపుతారు. కానీ ఒక్క వేటగాడి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు అని ఆమె పేర్కొన్నారు.