Foreign Funding: 6వేల ఎన్జీవోలకు విదేశీ విరాళాలు బంద్‌..!

దేశవ్యాప్తంగా నిన్నటితో దాదాపు 6వేల ఎన్జీవోలు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఇందులో ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం వంటివి ఉన్నాయి.

Foreign Funding: 6వేల ఎన్జీవోలకు విదేశీ విరాళాలు బంద్‌..!
Foreign Donations To 6,000 Ngos Closed
Follow us

|

Updated on: Jan 01, 2022 | 10:41 PM

Foreign donations: దేశవ్యాప్తంగా నిన్నటితో దాదాపు 6వేల ఎన్జీవోలు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఇందులో ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం వంటివి ఉన్నాయి. లైసెన్సు పునరుద్దరణ కోసం దరఖాస్తు చేసుకోని కొన్ని సంస్థలు, కొన్నిటికి కేంద్ర హోం శాఖ తిరస్కరణ ఆయా సంస్థలకు సంబంధించి సమాచారం ప్రతికూలంగా రావడంవల్లే తిరస్కరించినట్లు హోం శాఖ తెలిపింది.

దేశంలో 2021, డిసెంబర్‌ 31 నాటికి 22,762 ఎఫ్‌సీఆర్‌ఏ నమోదిత ఎన్జీవోలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంస్థలు లైసెన్సు కోసం తిరిగి దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకోనివి, దరఖాస్తును కేంద్రం తిరస్కరించినవి కలిపి మొత్తం 5,933 ఎన్జీవోలు లైసెన్సును కోల్పోయాయి. వీటితో కలిపి గత ఏడాదిగా మొత్తం 12 వేలకు పైగా ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయినట్లయింది. తాజాగా 2022, జనవరి 1 నాటికి విదేశీ విరాళాల లైసెన్సు కలిగిన సంస్థలు మొత్తం 16,829 మిగిలాయి.

తాజాగా లైసెన్సును కోల్పోయిన కొన్ని ముఖ్యమైన ఎన్జీవోలు… ఐఐటీ ఢిల్లీ జమియా మిలియా ఇస్లామియా నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ (మదర్‌ థెరిసా) ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ లాల్‌ బహదూర్‌ శాస్త్రి మొమోరియల్‌ ఫౌండేషన్‌ ఆక్స్‌ఫామ్‌ ఇండియా టీబీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా భారతీయ సంస్కృతి పరిషద్‌ డీఏవీ కాలేజ్‌ ట్రస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సొసైటీ సత్యజిత్‌రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్స్టిట్యూట్‌ లేడీ శ్రీరాం కాలేజి ఫర్‌ వుమెన్‌

ఎఫ్‌సీఆర్‌ఎ చట్టం.. ఏ ఎన్జీవో సంస్థ అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు, లేదా సంస్థల నుంచీ విరాళాలు తీసుకోవాలంటే, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద కేంద్ర హోం శాఖ నుంచీ లైసెన్సు తీసుకోవాలి. 1976లో అమలులోకి వచ్చిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) విదేశీ సంస్థల నుండి, వ్యక్తుల నుండి కానీ ఇక్కడి సంస్థలకు ఎటువంటి సహాయం అందాలన్నా చట్టంలో కొన్ని నియమనిబంధనలు, విధివిధానాలు ఏర్పాటు. 2010లో యూపీఎ ప్రభుత్వ హయాంలో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010’కు సవరణలు, న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలతో పాటు మీడియా రంగాల వారికి విదేశీ విరాళాలను నిషేధించారు. 2020లో మరికొన్ని సవరణలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తమ ఆధార్‌ వివరాలు ఇవ్వడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు విదేశీ విరాళాలను పొందటం నిషేధం, విదేశీ నిధులు పొందే సంస్థల సభ్యులు అందరూ తాము గతంలో ఎలాంటి మతమార్పిళ్లకు పాల్పడలేదని, ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ శిక్ష అనుభవించలేదు అని డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ సవరణలు చేసింది. విదేశీ నిధులు పొందే సంస్థలకు ఢిల్లీ భారతీయ స్టేట్‌ బ్యాంకులో ఎఫ్‌సీఆర్‌ఎ ఖాతా ఉండాలి. విదేశాల నుంచి అందుకుని, వినియోగించిన విరాళాల వివరాలు వార్షిక రిటర్నులు ఏటా ఇవ్వాలి. ఈ వివరాలను ఎఫ్.సి.ఆర్.ఎ. పోర్టల్ అయిన www.fcraonline.nic.inలో పొందుపరుస్తారు. ఆరేళ్లుగా విదేశీ విరాళాలను పొందుతూ వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను సమర్పించని వాటిపై చర్యలు తీసుకుంటారు. అంతకు ముందు 2014-19 మధ్య నిబంధనలను ఉల్లంఘించిన 14,500 స్వచ్ఛంద సంస్థలపై నిషేధం విధించారు.

గత 4 ఆర్ధిక సంవత్సరాలలో దేశంలోని స్వంచ్ఛంద సంస్థలకు అందిన విదేశీ నిధుల వివరాలు… సంవత్సరం నిధులు (కోట్లలో) 2016-17 15,355 2017-18 16,948 2018-19 16,525 2019-20 15,853

స్వచ్ఛంద సంస్థలకు అందే విరాళాలలో అత్యధిక భాగం అమెరికా నుంచే గత నాలుగేళ్లలో దేశంలోని వివిధ సంస్థలకు విదేశాల నుంచీ 64,681 కోట్ల విరాళాలు అందులో దాదాపు 25వేల కోట్లు (40 శాతం) ఒక్క అమెరికా నుంచే వచ్చాయి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నిబంధనలు ఉల్లంఘించి విరాళాలు సేకరిస్తూ, వాటిని దుర్వినియోగ పరుస్తున్న అనేక సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది.

Also Read: Vaccination: టీకా తీసుకున్నాక పిల్లల్లో ఈ సమస్యలుంటే భయపడవద్దు.. వైద్యుడి సలహా తీసుకోండి..

India Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..