Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలలో రెండు పెయిడ్‌ లీవ్స్‌.. కారణం చెప్పాల్సిన పనిలేకుండానే..

|

Oct 22, 2021 | 6:26 PM

Swiggy Leaves: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే మేధా సంపత్తిలో పురుషులతో..

Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలలో రెండు పెయిడ్‌ లీవ్స్‌.. కారణం చెప్పాల్సిన పనిలేకుండానే..
Swiggy Womens
Follow us on

Swiggy Leaves: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే మేధా సంపత్తిలో పురుషులతో సమానంగా, ఆ మాటకొస్తే ఓ మెట్టు ఎక్కువలో ఉన్నా.. మహిళలు నెలసరి వంటి వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఉద్యోగం చేసే మహిళలు పలు రకాల ఇబ్బందులు పడుతుంటారు. సెలవులు తీసుకుందామంటే ఏ కారణం చెప్పాలని సంశయిస్తుంటారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి ప్రముఖ ఫుడ్‌ డెలివరి యాప్‌ స్విగ్గీ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు శుభవార్త తెలిపింది.

సంస్థలో పనిచేస్తున్న మహిళలకు ప్రతి నెలా జీతంతో కూడిన సెలవులను అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో అధికారికంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చారు.. ‘నెలసరి సమయాల్లో మహిళలు బయటకు రావడానికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు. సాధారణంగా మహిళలు డెలివరీని వృత్తిగా ఎంచుకోకపోవడానికి బయటి చెప్పుకోలేని ప్రధాన కారణం ఇదేనని అభప్రాయపడ్డారు.

ఇక ఇలాంటి వారికి అండగా నిలిచేందుకునే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి కారణాలు చెప్పకుండానే మహిళలు ఈ సెలవులను తీసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రత కోసం వారి పని గంటలను సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేస్తూ ప్రకటన చేశారు.

Also Read: Maa Elections 2021: నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఏ లెటర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి..

House Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన రెండస్థుల భవనం.. నిద్రలోనే ఐదుగురు దుర్మరణం.. మరో ఆరుగురు..

T20 World Cup: ఈ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!