తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడారు. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా పుదియపాలెంలో ఈ విషాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మోహన్ అనే వ్యక్తి స్థానికంగా బట్టలు కుట్టే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కరోనా మొదలైనప్పటి నుంచి ఉపాధి సరిగ్గా లేకపోవడంతో అప్పులపాయ్యాడు. అప్పులు పెరిగిపోయి వడ్డీలు కట్టలేక తీవ్ర మనస్థాపానికి గురైన మోహన్.. భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వడ్డీలు తీసుకున్న మోహన్ కుటుంబాన్ని వడ్డీ వ్యాపారులు బెదిరించడంతో కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.