జమ్మూ కాశ్మీర్ లో పాక్ దళాల కాల్పులు, ఐదుగురు భారత సైనికుల మృతి

| Edited By: Pardhasaradhi Peri

Oct 01, 2020 | 4:09 PM

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ దళాలు కవ్వింపు కాల్పులకు దిగాయి.  వాస్తవాదీన రేఖ వద్ద జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు భారత జవాన్లు మరణించారు. సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే పాకిస్థాన్ సైనికులను..

జమ్మూ కాశ్మీర్ లో పాక్ దళాల కాల్పులు, ఐదుగురు భారత సైనికుల మృతి
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ దళాలు కవ్వింపు కాల్పులకు దిగాయి.  వాస్తవాదీన రేఖ వద్ద జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు భారత జవాన్లు మరణించారు. సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే పాకిస్థాన్ సైనికులను తాము దీటుగా ఎదుర్కొన్నామని భారత ఆర్మీ వర్గాలు తెలిపినప్పటికీ, పాక్ వైపున ఎంతమంది గాయపడిందీ, లేదా మృతి చెందిందీ తెలియలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బుధవారం రాత్రి నుంచే పాక్ సైనికులు మార్కోట్, కృష్ణఘాటి సెక్టార్లల్లో మోర్టార్లు, గన్స్ తో విరుచుకపడ్డారు.ఈ ఘటనల్లో ఐదుగురు గాయపడ్డారు. మరోవైపు-గురువారం ఉదయం కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ లో పాక్ దళాల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గత 8 నెలల్లో పాకిస్థాన్ మూడు వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే ఇంత జరుగుతున్నా భారత్ తన తీవ్ర నిరసనను ఆ దేశానికి తెలియజేయడం లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.