two-wheeler showroom: జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శివ్ నగర్ ఏరియాలోని ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పే సమయంలో ముగ్గురు ఫైర్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అగ్నిమాపక సిబ్బంది అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More:
ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6.5లక్షలకు పైగా కేసులు.. ఇదే తొలిసారి అన్న డబ్ల్యూహెచ్‌వో
Bigg Boss 4: అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయిన అఖిల్.. లాస్య, హారికలకు క్లాస్