డిజిటల్ చెల్లింపులతో పెరిగిన ఆర్ధిక మోసాలు, అజిత్ దోవల్

| Edited By: Anil kumar poka

Sep 19, 2020 | 12:39 PM

డిజిటల్ చెల్లింపుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజలను హెచ్చరించారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో డిజిటిల్ పేమెంట్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడవలసి వస్తోందని..

డిజిటల్ చెల్లింపులతో పెరిగిన ఆర్ధిక మోసాలు, అజిత్ దోవల్
Follow us on

డిజిటల్ చెల్లింపుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజలను హెచ్చరించారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో డిజిటిల్ పేమెంట్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడవలసి వస్తోందని, ఇదే సమయంలో ఆర్ధిక మోసాలు (ఫైనాన్షియల్ ఫ్రాడ్స్) పెరిగిపోయాయని ఆయన చెప్పారు. కేరళలో సైబర్ స్పేస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధానోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా… ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. డిజిటల్ చెల్లింపుల విషయంలో కొంతవరకు మనం మేనేజ్ చేయగలుగుతున్నప్పటికీ, సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ప్రజల్లో పెద్దగా  అవగాహన లేకపోవడం  కూడా సైబర్ నేరాలు పెరగడానికి కారణమవుతామవుతున్నాయని అజిత్ దోవల్ అభిప్రాయపడ్డారు.

ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ను అదుపు చేసేందుకు కేంద్రం నేషనల్ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయనుందని,  ఇది సురక్షితమైనది , విశ్వసించదగినదని  అజిత్ దోవల్ చెప్పారు.