Covid-19 Effect: కోవిడ్‌తో మరణించిన తండ్రి.. జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ తనయుడు ఏం చేశాడంటే..

|

Sep 28, 2021 | 2:25 PM

Covid-19 Effect: కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది.

Covid-19 Effect: కోవిడ్‌తో మరణించిన తండ్రి.. జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ తనయుడు ఏం చేశాడంటే..
Statue
Follow us on

Covid-19 Effect: కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారు లేని లోటు కనిపించకుండా. వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్యక్రమాలను జరిపిస్తున్న ఘటనలు ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారుతున్నాయి. తాజాగా కోవిడ్‌తో మరణించిన తన తండ్రి జ్ఞాపకార్థం ఓ కొడుకు సిలికాన్‌ విగ్రహన్ని తయారు చేయించి ఇంట్లో నిలుపుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

సాంగ్లీ జిల్లాకు చెందిన అరుణ్‌ కోరే అనే వ్యాపారవేత్త చనిపోయిన తన తండ్రి జ్ఞాపకార్థం సిలికాన్‌ విగ్రహాన్ని తయారు చేయించారు..అరుణ్‌ తండ్రి రావ్‌సాహెబ్‌ షామ్రావ్‌ కోరే నాగపూర్‌లో రాష్ట్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించేవారు..అయితే, 2020 సెప్టెంబర్‌ 6న రావ్‌సాబ్‌ కోవిడ్‌తో మృతిచెందారు..తండ్రి మరణంతో ఇంటిల్లిపాది తీరని దుఃఖంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కర్ణాటకు చెందిన ఓ వ్యాపారి చనిపోయిన తన భార్య రూపాన్ని విగ్రహంగా తయారు చేయించిన వార్తను యూట్యూబ్‌లో చూశాడు అరుణ్‌ కోరే….వెంటనే ఆ విగ్రహం తయారు చేసిన కళాకారుడి ఫోన్‌ నెంబర్‌ సంపాదించాడు..తన తండ్రి రావ్‌సాహేబ్‌కు సైతం విగ్రహం తయారు చేయాలని కోరాడు..15లక్షల వ్యయంతో తండ్రి సిలికాన్‌ విగ్రహం తయారైంది..నాన్న ప్రతిబింబం చూసుకుని ఆ కొడుకు ఎంతగానో మురిసిపోతున్నాడు..

సాంగ్లీ నగరంలోని పోలీస్‌ కాలనీలో నివసిస్తున్న రావ్‌ కుటుంబ సభ్యులు..ఇంట్లోని ఓ గదిని పూర్తిగా ఓ చిన్నపాటి మ్యూజియంలా మార్చేశారు..అందులో రావ్‌ యూనిఫాం, మెడల్స్, రివార్డులను ఉంచారు..కాగా, తన భర్త మరణంతో ఇంట్లోని వారంతా ఎంతగానో కుంగిపోయారని, పిల్లల సంతోషాల నడుమ తన భర్త ఉండాలనే కోరికతో ఇలా విగ్రహం తయారు చేయించినట్లుగా రావ్‌ భార్య తెలిపారు.

Also read:

Dragonfly: తూనీగలు హెచ్చరిస్తున్నాయా.. మేఘం రంగును గమనిస్తున్నాయా.. కోనసీమవాసుల్లో కొత్త గుబులు..

French President: ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న అధ్యక్షుడు.. దూసుకొచ్చిన కోడిగుడ్డు

Inspiring Story: ఆర్ధిక పరిస్థితి అడ్డంకిగా మారినా.. వాటిని అధిగమించి ఐఏఎస్ ఆఫీసరైన బస్సు డ్రైవర్ కూతురు..