Farmers Protest: మరోమారు భగ్గుమన్న అన్నదాత..! రైల్వే ట్రాక్‌పై బైఠాయించి రాస్తారోకో..డిమాండ్స్‌ ఏంటంటే..

|

Oct 04, 2024 | 8:29 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి, రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మనం కలిసి రాకపోతే మన పోరాటం బలహీనపడుతుందన్నారు.

Farmers Protest: మరోమారు భగ్గుమన్న అన్నదాత..! రైల్వే ట్రాక్‌పై బైఠాయించి రాస్తారోకో..డిమాండ్స్‌ ఏంటంటే..
Farmers Protest
Follow us on

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం రైల్ రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రైల్వే ట్రాక్‌పై కూర్చొని పలు రైళ్లను అడ్డుకున్నారు. ముక్త్‌సర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైతు సంఘాలు నిరసనకు దిగాయి. కొందరు రైతులు రైల్వే ట్రాక్‌పై కూర్చోగా, మిగిలిన వారు ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్నారు. కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి, రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మనం కలిసి రాకపోతే మన పోరాటం బలహీనపడుతుందన్నారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనూ రైతులు ఆందోళన చేపట్టారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. దేవిదాస్‌పురా రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. దీనిపై రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. పంజాబ్‌లో వరి పంటను కొనుగోలు చేయడంలేదని, రైతు ఎంఎస్‌పీపై హామీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

మరో చోట కిసాన్ మజ్దూర్ హిత్కారీ సభ సభ్యులు జలంధర్ జిల్లా, బంగాలాలోని ధాన్యం మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ వరకు కవాతు నిర్వహించారు. జలంధర్-జమ్ము రైలు సెక్షన్‌పై నిరసన వ్యక్తం చేశారు. ముకేరియన్ స్టేషన్‌లో పఠాన్‌కోట్ వెళ్లే గూడ్స్ రైలును అడ్డుకున్నారు. దీనివల్ల పఠాన్‌కోట్‌కు వెళ్లే మార్గంలో ముకేరియన్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..