కూరగాయలు అమ్మిన సుధా మూర్తి.. అసలు విషయమేంటంటే

| Edited By:

Sep 14, 2020 | 5:43 PM

ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిన్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

కూరగాయలు అమ్మిన సుధా మూర్తి.. అసలు విషయమేంటంటే
Follow us on

Sudha Murthy News: ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిన్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ, ఆమె చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. కట్టుబొట్టు మొదలు మాట తీరు, సాయపడే గుణంలో సుధా మూర్తి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె కూరగాయలు అమ్ముతున్నట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఈగోను పక్కనపెట్టి ప్రతి సంవత్సరం సుధా మూర్తి ఇలాంటి సేవలు చేస్తుంటారు అని ఓ నెటిజన్ ఆ ఫొటోను షేర్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారగా.. పలువురు సుధా మూర్తిని ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు.

ఇక దీనిపై ఫాక్ట్‌చెక్‌ వివరణ ఇచ్చింది. సుధామూర్తి అక్కడ కూరగాయాలు అమ్మడం లేదని, తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక స్టోరేజ్‌ని నడుపుతున్నారని ఫాక్ట్‌చెక్‌లో తేలింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సుధా మూర్తి దేవాలయాల దగ్గర ఫలితాన్ని ఆశించని సేవ చేస్తున్నారు. భక్తులకు ప్రసాదాలు తయారు చేయడం, కూరగాయలు కడగటం, వాటిని కట్ చేయడం వంటి పనులను ఆమె చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బెంగళూరు జయనగర్‌లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆమె స్టోర్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ విషయాన్ని మఠం అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

ఓ దినపత్రిక వివరాల ప్రకారం ప్రతి ఏడాది మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆలయంలో సుధా మూర్తి తన సేవలను అందిస్తారట. ఆ మూడు రోజులు 4 గంటలకే లేచి, గుడికి వెళ్తారట. నాలుగు గంటల పాటు అక్కడి వంట గది సహా పక్కనున్న గదులను ఆమె శుభ్రపరుస్తారట. అలాగే కూరగాయాలను నింపడం, వాటిని కోయడం, చెత్తను పడేయం వంటి పనులను చేస్తారట. ఇవన్నీ ఆమె ఒక్కరే చేస్తారట. అయితే పెద్ద పెద్ద సంచులను తీసుకొచ్చేందుకు మాత్రం ఒక అసిస్టెంట్‌ సాయం తీసుకుంటారట. ఆ తరువాత 9 గంటలకు తన ఇంటికి తిరిగి వెళ్తారట. ఈ విషయాలు తెలిసిన కొంతమంది ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది సుధా మూర్తిని చూసి నేర్చుకోవాలి అని అంటుంటారు.

Read More:

డెట్రాయిట్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతోన్న మహేష్‌..!

‘అంతర్వేది’లో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేత