యూపీ రాజధాని లక్నోలో కుప్పలా కూలిపోయిన మాజీ ఎంపీ బిల్డింగ్… రక్షిత కట్టడాల పరిధిలోనిదన్న అధికారులు

| Edited By: Phani CH

Jul 04, 2021 | 9:47 PM

యూపీలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన దావూద్ అహ్మద్ అనే మాజీ ఎంపీ బిల్డింగ్ ని అధికారులు క్షణాల్లో కూల్చివేశారు. లక్నోలో ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది..

యూపీ రాజధాని లక్నోలో కుప్పలా కూలిపోయిన మాజీ ఎంపీ బిల్డింగ్... రక్షిత కట్టడాల పరిధిలోనిదన్న అధికారులు
Ex Mps Building Razed In Up

యూపీలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన దావూద్ అహ్మద్ అనే మాజీ ఎంపీ బిల్డింగ్ ని అధికారులు క్షణాల్లో కూల్చివేశారు. లక్నోలో ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది.. సుమారు ఏడెనిమిది అంతస్తులున్న ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. ఈ బిల్డింగ్ బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ రెసిడెన్సీ పరిధిలోనిది.. 18 వ శతాబ్దంలో నిర్మించిన ఈ రెసిడెన్సీ సమీపంలో మరే కట్టడం ఉండరాదన్న నిబంధన ఉందని పురాతత్వ శాఖ అధికారులు చెప్పారు. అంటే ఈ పరిధిలో అక్రమ కట్టడాలు ఉండరాదన్న కచ్చితమైన రూల్ ఉందన్నారు. రక్షిత కట్టడాలుగా ప్రకటించిన వాటి చోట ఈ విధమైనవి ఉండరాదని తెల్సినా ఈ మాజీ ఎంపీ ఆ నిబంధనను కాదని దీన్ని నిర్మిస్తున్నాడన్నారు. లక్నో జిల్లా మేజిస్ట్రేట్ ఇదే విషయాన్నీ చెబుతూ.. 2018 లోనే ఈ అక్రమ బిల్డింగ్ ని కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చినా దావూద్ అహ్మద్ కోర్టుకు వెళ్లారని, కానీ ఆయన పిటిషన్ ని కోర్టు తిరస్కరించిందని అన్నారు. ఆ తరువాత లక్నో డెవలప్ మెంట్ అథారిటీ కూడా అయన అభ్యర్థనను తోసిపుచ్చిందని చెప్పారు.

ఈ భవనాన్ని కూల్చి వేయాలని మళ్ళీ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదని.. చివరకు పురాతత్వ శాఖ అధికారులే వచ్చి దీన్ని కూల్చివేశారని ఆయన చెప్పారు. బిల్డింగ్ కూల్చివేత సమయంలో ఎక్జవేటర్ నడుపుతున్న ఓ డ్రైవర్ మీద శిధిలాలు మీద పడడంతో ఆయన గాయపడ్డాడు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ బిల్డింగ్ కూల్చివేత పనులను చేపట్టారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా

లోని పై కేసులో 11 మందిపై యూపీ పోలీసుల చార్జిషీట్.. మళ్ళీ ట్విటర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు

Follow us on