లోయలో మరో ఎన్‌కౌంటర్.. బుద్గాంలో పలువురు ఉగ్రవాదులు అరెస్ట్..

కశ్మీర్‌లోయలో మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం తెల్లవారుజామునే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

లోయలో మరో ఎన్‌కౌంటర్.. బుద్గాంలో పలువురు ఉగ్రవాదులు అరెస్ట్..

Edited By:

Updated on: Jun 25, 2020 | 10:39 AM

కశ్మీర్‌లోయలో మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం తెల్లవారుజామునే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోపోర్ జిల్లాలోని హర్డ్‌శివ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసు బలగాలు.. సంయుక్తంగా ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు వీరిని చూసిన వెంటనే కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు.

మరోవైపు బుద్గాం పోలీసులు నర్బల్ ప్రాంతంలో గాలింపు చేపడుతుండగా.. ఐదుగురు ఉగ్రవాద అనుచరులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల్ని ఇమ్రాన్ రషీద్, ఇఫ్షాన్ అహ్మద్ ఘనీ, ఒవైస్ అహ్మద్, మోసిన్ ఖాదీర్, అబీద్ రాదర్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 28 రౌండ్ల బుల్లెట్లు, ఏకే47, ఒక మ్యాగజైన్, మరికొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.