మెడికల్ ఎమర్జెన్సీ! పాక్ ఆక్రమిత కాశ్మీర్ బహవల్పూర్ ఆసుపత్రులలో పరిస్థితి ఎలా ఉందంటే..

మరోవైపు, పాకిస్థాన్ లోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్ పోర్టుల్లో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ను మూసివేయడంతో అక్కడకు చేరాల్సిన విమానాలను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మెడికల్ ఎమర్జెన్సీ! పాక్ ఆక్రమిత కాశ్మీర్ బహవల్పూర్ ఆసుపత్రులలో పరిస్థితి ఎలా ఉందంటే..
Emergency Situation

Updated on: May 07, 2025 | 9:53 AM

భారత్ ఆర్మీ ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మంగళవారం రాత్రి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. PoKను ఆనుకుని ఉన్న ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఈ దాడి తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ బహవల్పూర్‌లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. పాక్ పంజాబ్ లో విద్యాసంస్థల్ని మూసివేయాలని ఆదేశించారు. గాయపడిన పౌరులు వైద్యం కోసం భారీగా ఆస్పత్రిలో చేరినట్టు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

మరోవైపు, పాకిస్థాన్ లోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్ పోర్టుల్లో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ను మూసివేయడంతో అక్కడకు చేరాల్సిన విమానాలను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..