Edible Oils Price rise worrying commonman: దేశంలో వంట నూనెల ధరలు (EDIBLE OIL PRICES) అదే పనిగా పెరుగుతుండడంతో సామాన్యుడు (COMMON MAN) కుదేలవుతున్నాడు. కరోనా కష్ట కాలం (CORONA PANDEMIC)లో మొదలైన వంట నూనెల ధరల పెరుగుదల గత ఏడెనిమిది నెలలుగా కొనసాగుతోంది. వేరుశెనగ (PEANUT), పొద్దుతిరుగుడు (SUNFLOWER), పామాయిల్(PALMOIL)తో సహా అన్ని నూనెల ధరలు పెరిగిపోతూనే వున్నాయి. దాంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడుతోంది. అందుకు కారణాలను అన్వేషిస్తున్న కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT)ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తూనే వ్యవసాయ రంగంలో కొన్ని మార్పుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది.
నిజానికి భారత దేశం (INDIA) ఆహార ఉత్పత్తుల ఎగుమతు (FOOD GRAINS EXPORTS)ల్లో ముందుంది. కానీ వంట నూనెల విషయంలోనే పరిస్థితి భిన్నంగా వుంది ప్రపంచంలో వంట నూనెలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం ఒకటిగా నిలుస్తోంది. దేశీయ అవసరాల కోసం వంట నూనెల దిగుమతిపైనే మన దేశం ఎక్కువ స్థాయిలో ఆధారపడుతోంది. కరోనా పాండెమిక్ రోజుల్లో దిగుమతులు గణనీయంగా తగ్గడంతో మన దేశంలో వంట నూనెల ధరలు అదే పనిగా పెరిగిపోతున్నాయి. అయితే.. వంట నూనెల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలను విశ్లేషిస్తే చాలానే కనిపిస్తున్నాయి. దేశంలో డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్పత్తుల తగ్గుముఖం పట్టడం, ఉక్రెయిన్ (UKRAINE), రష్యా (RUSSIA) దేశాల్లో పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, మలేషియా (MALAYSIA), ఇండోనేషియా (INDONESIA) దేశాల్లో పామాయిల్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, అర్జెంటీనా (ARGENTINA), బ్రెజిల్ (BRAZIL) తదితర దేశాలు కరువు పరిస్థితుల వల్ల తగ్గినంత సోయాబీన్ ఉత్పత్తి చేయలేకోవడం వంటివి దేశంలో వంట నూనెల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
దేశానికి అసవరమయ్యే వంట నూనెల్లో 60 శాతానికి పైగా దిగుమతులపైనే మన ఆధార పడుతున్నాం. చైనా (CHINA), యూరోప్ (EUROPE) దేశాల నుంచి వంటనూనెలు దిగుమతి మనకు దిగుమతి అవుతున్నాయి. మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఉక్రెయిన్ నుంచి సన్ ప్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది. కాగా.. దేశంలో వంట నూనెల డిమాండ్ సుమారు 22 మిలియన్ టన్నులు కాగా.. అందులో 15 మిలియన్ టన్నుల వంట నూనెలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల్లో పామాయిల్‌దే సింహభాగం. ఆయిన్ దిగుమతుల్లో 60 అంటే సుమారు 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఇండోనేషియా వాటానే అధికం. ఇండోనేషియాతోపాటు మలేషియాలో పామాయిల్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పామాయిల్‌లో 82 శాతం ఇండోనేషియా, మలేషియాల్లోనే ఉత్పత్తి అవుతుండడం విశేషం.
ప్రపంచ ఉత్పత్తిలో…
పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఇండోనేషియా అన్ని రకాల వంట నూనెల ఉత్పత్తిలోను మొదటి స్థానంలోనే వుంది. సుమారు 47 మిలియన్ టన్నుల అన్ని రకాల వంట నూనెల ఉత్పత్తి చేస్తూ.. 24శాతంతో ఇండోనేషియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. 13.2 శాతం వంట నూనెల ఉత్పత్తితో చైనా రెండో స్థానంలో వుండగా.. 11.3 శాతం ఆయిన్ ప్రొడక్షన్‌తో మూడో స్థానంలో మలేషియా, 9.2 శాతంతో నాలుగో స్థానంలో ఈయూ వున్నాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. వంట నూనెల ఎగుమతుల్లో ఇండోనేషియావే 37 శాతం వున్నాయి. మన దేశంతోపాటు ప్రపంచంలో చాలా దేశాలకు ఇండోనేషియా వంట నూనెలను ఎగుమతి చేస్తోంది. ఇక వంట నూనెల ఎగుమతుల్లో మలేషియాది రెండో స్థానం. మలేషియా 22 శాతం వంట నూనెలలను ప్రపంచ దేశాలను ఎగుమతి చేస్తోంది. వంట నూనెల దిగుమతుల్లో భారత దేశానిదే పెద్ద వాటా. భారత దేశంలో 207 శాతం వంట నూనెలను దిగుమతి చేసుకుంటుండగా.. ఈయూ రెండో స్థానంలోను, చైనా మూడో స్థానంలోను వున్నాయి.
భారత దేశంలో వంట నూనెల ఉత్పత్తి తగిన స్థాయిలో లేదనడానికి తాజా గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మన దేశంలో 3.3. లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగు అవుతోంది. పామాయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ముందున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, కేరళ, మిజోరం, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో పామాయిల్ సాగు చెప్పుకోదగిన స్థాయిలో వుంది. కరోనా ప్రభావం, దిగుమతుల పరిమాణం పెరగడం వల్ల దేశంలో అన్ని వంట నూనెల ధరలు రూ. 150ని దాటేశాయి. పేద ప్రజలు ఎక్కువగా వినియోగించే విజయ బ్రాండ్ పామాయిల్ ధర ఒక్కటే రైతు బజార్లలో రూ. 105గా కొనసాగుతోంది. ఇది బహిరంగ మార్కెట్లకు వచ్చే సరికి రూ.130కి లభిస్తోంది.
మార్కెట్లో వంట నూనెల ధరలు (హైదరాబాద్)
ఆగస్టు 2020 జనవరి 2021 ఏప్రిల్ 2021
పామాయిల్ 84 105 130
సన్ ఫ్లవర్ 100 128 159
పల్లీ నూనె 119 139 175
రైస్ బ్రాన్ 92 111 155
హైదరాబాద్ నగరంలో వంట నూనెలల ధరలు ఇలా వుండగా.. మిగిలిన ప్రాంతాలు, దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో పరిస్థితి మరింత దారుణంగా వుంది. దిగుమతులు పెరిగే వరకు మరికొద్ది కాలం ఇదే పరిస్థితి వుంటుందని వాణిజ్య వర్గాలు అంఛనా వేస్తున్నాయి. దిగుమతులు సాధారణ స్థాయికి వస్తేనే దేశంలో వంటనూనెల మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరఫరా నెలకొని ధరలు స్థిరీకరణ జరుగుతుందని వారంటున్నారు.
గత ఐదేళ్లలో వంటనూనెల దిగుమతులను పరిశీలిస్తే ఏడాదికేడాది పెరుగుతునే వున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఉత్పత్తి 8.63 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా.. 14.85 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను మన దేశం దిగుమతి చేసుకుంది. 2016-17లో 10.09 మిలియన్ మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి కాగా.. 15.32 మిలియన్ మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. 2017-18లో 10.38 మిలియన్ మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయ్యింది. 14.59 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకున్నాం. 2018-19లో 10.35 మిలిటయన్ మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి కాగా.. 15.57 మిలియన్ మెట్రిక్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. 2019-20లో 10.65 మిలియన్ మెట్రిక్ టన్నులు స్థానికంగా ఉత్పత్తి చేసుకోగా.. 13.34 మిలియన్ మెట్రిక్ టన్నులు విదేశాలను మనకు ఎగుమతి చేశాయి.
దిగుమతులు తగ్గడం వల్ల దేశంలో వంట నూనెల ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపితే.. వంట నూనెల ధరలు కాస్తైనా తగ్గే అవకాశం వుందంటున్నాయి మార్కెట్ వర్గాలు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గిస్తే ధరలు కొంత తగ్గే అవకాశం వుందని అంటున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిగుమతి సుంకాలు పెరిగాయని కొందరి అభిప్రాయం. వంట నూనెల ధరల స్థిరీకరణ శాశ్వతంగా జరగాలంటే.. దేశీయంగా నూనె గింజల పంటల సాగును పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ పంటలు సాగుచేసే రైతులకు కేంద్రం మద్దతు ధర, ప్రోత్సాహకాలు పెంచాల్సి వుంది. రాష్ట్రాలు సైతం వంట నూనెల ఉత్పత్తికి ప్రోత్సాహకాలందించాల్సిన అవసరం వుంది.
ALSO READ: అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!