Eco-friendly Ganesh: వినాయకుడి విగ్రహాలు మట్టితో కాదు.. ఆవు పేడతో.. తయారీలో కొత్త ఆలోచన భోపాల్ యువతి శ్రీకారం..

|

Sep 09, 2021 | 1:14 PM

ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పంచకం ఔషధాలకు నెలవు.. ఆవు పాలు తల్లిపాలతో సమానం అంటారు.. ఇక గ్రామాలలో ఆవు పేడను పిడకలుగా తయారు చేస్తారు. పొయ్యిలో వంటలకు...

Eco-friendly Ganesh: వినాయకుడి విగ్రహాలు మట్టితో కాదు.. ఆవు పేడతో.. తయారీలో కొత్త ఆలోచన భోపాల్ యువతి శ్రీకారం..
Eco Friendly
Follow us on

ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పంచకం ఔషధాలకు నెలవు.. ఆవు పాలు తల్లిపాలతో సమానం అంటారు.. ఇక గ్రామాలలో ఆవు పేడను పిడకలుగా తయారు చేస్తారు. పొయ్యిలో వంటలకు, పొద్దునే ఇంటి ముందు ముగ్గు వేసే ముందు పేడ నీళ్ళతో కల్లాపి చల్లుతారు. ఇలాంటి చాలా రకరాలుగా ఉపయోగిస్తారు. ఇక ఇంట్లో పాడి ఉన్న ఇల్లాలికి చేతి నిండా పనే.. చేతి నిండా డబ్బులే.. పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటారు గ్రామీణ మహిళలు. అయితే ఇప్పుడు ఆవు పేడకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఆదాయ వనరుగా మార్చుకుని తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి విగ్రహాలు తయారు తయారు చేస్తోంది ఓ మహిళలు. ఎక్కడంటారా.. మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళలు. ఆవు పేడను ఉపయోగించి పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు.

దేశవ్యాప్తంగా వినాయక సందడి షురూ అయింది..గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో హోరెత్తిపోతోంది. ఎటు చూసినా వీధులన్నీ గణనాథుని విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. ప్రతిమల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. గతేడాది కరోనాతో ఉత్సవాలకు దూరమైన ప్రజలు.. ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

భోపాల్‌కు చెందిన ఈ మహిళ తనకు వచ్చిన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం చాలా ఈజీ అని చెప్పారు. కేవలం 15 నిమిషాల్లో ఆకర్శనీమైన విగ్రహం తయారు చేయవచ్చని.. ఆ తర్వాత వాటిని నాలుగు రోజుల పాటు ఆర పెడితే సరిపోతుందని తెలిపారు కాంత యాదవ్.

ఎలా తయారు చేస్తారో వివరించారు. ముందుగా “ఈ వినాయక విగ్రహాలు ఆవు పేడతో తయారు చేస్తాము. ఆవు పేడ ఎండిన తర్వాత అందులో కొంత చెక్క పొట్టు, మైదా పొడిని కలుపుతాము. మిశ్రమాన్ని అచ్చులో పోసి దాని నుండి విగ్రహాన్ని తయారు చేస్తాము. సహజ రంగులను ఉపయోగిస్తాము. హిందూ సంస్కృతిలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు. అందుకే మేము ఆవు పేడతో విగ్రహాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాము”అని కాంత యాదవ్ చెప్పారు.

తాము తయారు చేసిన విగ్రహాలకు స్థానికంగానే కాకుండా పూణే, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయని తెలిపారు. ప్రజలు నిజంగా ఈ విగ్రహాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని ఉందని అడుగుతున్నారని.. అయితే అలా నేర్చుకోవాలని ఇష్టంగా ఉన్నవారికి తాము నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కాంత యాదవ్ తెలిపారు. ఇలాంటి కొత్త ఆలోచనలు చూస్తే ప్రక‌ృతికి మనం మరింత మేలు చేయవచ్చని ఈ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..