PM Modi Interview highlights: కేంద్రంలో ప్రధాని మోదీ వర్సెస్ కాంగ్రెస్ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. ఎవరి తాత, తండ్రి, తల్లి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. తాను కేవలం గత పాలకుల పనితీరుపైనే మాట్లాడానంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తంచేశారు. ఐదు రాష్ట్రాల్లో (Election 2022) జరిగే ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రముఖ వార్త సంస్థ ఏఎస్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఎన్ఐఏ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి స్మితా ప్రకాశ్ ఇంటర్వ్యూ చేయగా.. ఆయన అనేక అంశాలపై తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అనేదే బీజేపీ నినాదం అని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని, ప్రజలు తమ పార్టీతోనే ఉన్నారని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో కొన్ని పార్టీలు భిన్నత్వం పేరుతో విషబీజాలు నాటుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారని, దేశం, రాష్ట్రాలు, పార్టీలు నష్టపోయినా సరే కుటుంబాన్ని కాపాడండి అన్నట్లుగా ఇప్పటి రాజకీయాలు తయారయ్యాయని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వ్యాపారం చేయడం ప్రభుత్వ లక్ష్యం కాదని తెలిపారు.
50 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని విభజించడానికి మాత్రమే పనిచేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విభజన సూత్రం దేశ ప్రజల లక్షణం కాదన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే సిద్ధాంతాన్నే తాను గట్టిగా నమ్ముతానని ప్రధాని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ ఓ కుటుంబం చేతిలో ఉండటం ప్రమాదకరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. తాను, వాజ్‌పేయి తప్ప దేశాన్ని పాలించింది కాంగ్రెస్సే అని అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం అని విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి పెడితే చాలా ముందుకెళ్లేవాళ్లమన్నారు.
ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని స్పష్టంచేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే తమ నినాదం అన్నారు. దేశంలో కొందరు విభజించు పాలించు పాలసీని అమలు చేశారని విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. తాము మాత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతున్నామని అన్నారు. యూపీలో గుండాగిరి లేకుండా చేశామని.. ప్రజలు తమనే విశ్వసిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
Also Read: