Russia-Ukraine War: ప్లీజ్‌.. ప్లీజ్‌.. మోదీజీ మీరు జోక్యం చేసుకోండి.. పుతిన్ మీ మాట వింటారు.. భారత్‌ను వేడుకున్న ఉక్రెయిన్‌ రాయబారి

|

Feb 24, 2022 | 6:30 PM

సంక్షోభం సమయంలో భారత్​ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నామని ఉక్రెయిన్​ భారత్‌ను కోరింది. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్‌ మద్దతు ఇవ్వాలన భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలికా అన్నారు.

Russia-Ukraine War: ప్లీజ్‌.. ప్లీజ్‌.. మోదీజీ మీరు జోక్యం చేసుకోండి.. పుతిన్ మీ మాట వింటారు.. భారత్‌ను వేడుకున్న ఉక్రెయిన్‌ రాయబారి
Dr Igor Polikha, Ambassador
Follow us on

సంక్షోభం సమయంలో భారత్​(India) నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నామని ఉక్రెయిన్​ (Ukraine)భారత్‌ను కోరింది. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్‌ మద్దతు ఇవ్వాలన భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి(Ambassador of Ukraine) ఇగోర్‌ పొలికా(Dr Igor Polikha ) అన్నారు. తక్షణమే యుద్ధం నిలువరించే దిశగా భారత్‌ చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు. ” ప్లీజ్‌ .. ప్లీజ్‌.. భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తప్పకుండా వింటారు.. అని వేడుకుంటున్నారు.. రష్యా ముప్పేటదాడి చేయడంతో ఉక్రెయిన్‌.. భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించే శక్తి భారత్‌ ఉందని.. ఈ కష్టకాలంలో భారత్‌ తమకు అండగా ఉండాలని కోరారు ఇగోర్‌ పొలికా. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగిందని.. రష్యా బలగాలు సరిహద్దులను దాటి తమ భూభాగంలోకి వచ్చేశాయని అన్నారు. గతంలో చాలా సార్లు భారత్‌ శాంతిస్థాపనలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్‌ చేసి మాట్లాడాలని కోరారు.

మోదీ పలుకుబడితో పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నించాలని కోరారు ఇగోర్​ పొలిఖా. ఉక్రెయిన్‌ ప్రజలకు భరోసా ఇచ్చేలా మోదీ చొరవ చూపాలన్నారు. అన్ని విషయాలను భారత ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. సంక్షోభ వేళ భారత వ్యవహారశైలి అసంతృప్తి కలిగిస్తోందన్నారు.

 

ఇదిలావుంటే.. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది భారత్. యుద్ధం విషయంలో తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఈ వివారాలను ఇప్పటికే భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శాంతియుత మార్గాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ భారతీయుల భద్రతపైనే ఫోకస్ పట్టింది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రష్యా, ఉక్రెయిన్‌ బలగాల మధ్య ఘర్షణలు తప్పవని పొలిఖా ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దుందుడుకు చర్యలను ఉక్రెయిన్‌ గట్టిగా తిప్పికొడుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్​లో పరిస్థితిలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయని.. ఇది చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు ఉక్రెయిన్​లోని భారత రాయబారి.

వాయు స్థావరాలు మూసివేశారని, రైల్వేలు నడిచే పరిస్థితులు కనిపించటం లేదని, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్​ నిలిచిపోయినట్లు చెప్పారు. ఉక్రెయిన్​లోని పౌరులు శాంతియుతంగా ఉండాలని, పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. కివీలోని భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లోని భారత సంతతి ప్రజలను కలిసి.. భారతీయులకు సాయంగా నిలవాలని కోరినట్లు చెప్పారు రాయబారి.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వివరాల కోసం ఇక్కడ చూడండి..