
పోర్న్ వీడియోలు.. ఈ మధ్యకాలంలో యువత అంతా వీటికి బానిసైపోతున్నారు. పెద్దలైతే ఈ పోర్న్ వీడియోలను చూస్తూ తమ లైంగిక ఆనందాన్ని పొందుతారు. ఇక ఈ పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తే.. మెంటల్, సైకలాజికల్ సమస్యలు తలెత్తుతాయని చాలామంది సైకాలజిస్టులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చైల్డ్ పోర్నోగ్రఫీపై కీలక తీర్పును మద్రాసు హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పోర్న్ వీడియోలకు బానిసలైన వారిని నిందించడానికి బదులు ఆ అలవాటు మాన్పించేందుకు కృషి చేయాలని మద్రాస్ హైకోర్టు అధికారులకు సూచించింది. వ్యక్తిగతంగా పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం, చూడటం నేరం కాదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే చట్టప్రకారం శిక్షార్హులని స్పష్టం చేసింది. పిల్లల అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్‌లో చూసినందుకు ఓ యువకుడిపై నమోదైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే ఆ కేసును కొట్టేసింది న్యాయస్థానం.
తన వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లో చైల్డ్ పోర్న్‌గ్రఫీ చూస్తున్నాడని ఆరోపిస్తూ 28 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్.. చైల్డ్ పోర్న్‌గ్రఫీ చూడటం నేరం కాదని చెప్పారు. సదరు వ్యక్తి ఆ కంటెంట్‌ను మరెవరికీ పంపించలేదని గుర్తించలేదన్న న్యాయస్థానం.. పోక్సో, ఐటీ చట్టాల కింద ఎలాంటి నేరం చేయలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.(Reference Link)
మరిన్ని జాతీయ వార్తల కోసం..