‘ఇంకా ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’ పదాలెందుకు’ ? జస్టిస్ మురళీధర్

| Edited By: Pardhasaradhi Peri

Mar 16, 2020 | 6:42 PM

లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్' అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు.

ఇంకా మై లార్డ్, యువర్ లార్డ్ షిప్ పదాలెందుకు ? జస్టిస్ మురళీధర్
Follow us on

లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’ అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు. ఈ మేరకు ఆయన సూచించినట్టు చండీగఢ్ లోని బార్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈయన ఇటీవలే ఇక్కడి కోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయమూర్తులను ‘సర్’ అని గానీ, ‘యువర్ ఆనర్’ అని గానీ సంబోధించాలని చండీగఢ్ లోని హైకోర్టు బార్ అసోసియేషన్ గతంలో తమ లాయర్లకు సూచించింది. అయితే అనేకమంది న్యాయవాదులు తమ జడ్జీలను యువర్ లార్డ్ షిప్ అనో, మై లార్డ్ లేదా మిలార్డ్ అనో సంబోధిస్తూ వస్తున్నారు. తాజాగా జస్టిస్ మురళీధర్ ఈ సూచన చేయడం విశేషం.

ఢిల్లీ అల్లర్ల సందర్భంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల ప్రసంగాల తాలూకు వీడియోలను తాము చూడలేదన్న నగర పోలీసు ఉన్నతాధికారులను అప్పటి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న మురళీధర్ దాదాపు మందలించినత పని చేశారు. వారి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బహుశా తెరవెనుక బీజేపీ నేతల ప్రయత్నాల ఫలితమో, మరో కారణం వల్లో ఆ మరునాడే అయన పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. తన బదిలీని ఆయన హుందాగా స్వీకరించారు.