AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రధాని మోదీతో కలిసి ఉద్రిక్తతలను పరిష్కరిస్తాం..’ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన..!

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య దాదాపు నెల రోజులుగా యుద్ధం సాగుతోంది. మరోసారి అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు . "ప్రధాని మోదీ, నేను కలిసి మాత్రమే ఈ సంఘర్షణకు పరిష్కారం చూపగలము " అని ట్రంప్ పేర్కొన్నారు.

'ప్రధాని మోదీతో కలిసి ఉద్రిక్తతలను పరిష్కరిస్తాం..' డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన..!
Donald Trump , Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: Mar 27, 2026 | 12:31 PM

Share

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య దాదాపు నెల రోజులుగా యుద్ధం సాగుతోంది. మరోసారి అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు . “ప్రధాని మోదీ, నేను కలిసి మాత్రమే ఈ సంఘర్షణకు పరిష్కారం చూపగలము ” అని ట్రంప్ పేర్కొన్నారు.

మంచి ఫలితాలను సాధించిపెట్టే నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. భారత్-అమెరికా సంబంధాల భవిష్యత్తుపై ఆయన బలమైన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా పంపిన ఒక సందేశంలో ట్రంప్ పేర్కొన్నారు.

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం శుక్రవారం (మార్చి 26) తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ సందేశాన్ని పోస్ట్ చేసింది. “భారతదేశంతో మన అద్భుతమైన సంబంధం మరింత బలపడుతుంది. ప్రధాని మోదీ, నేను పనులు పూర్తి చేసే వ్యక్తులం, ఈ మాట చాలా మంది గురించి చెప్పరు.” అని ట్రంప్ రాశారు. ఇదిలావుంటే, మంగళవారం (మార్చి 24) ప్రధానమంత్రి మోదీతో జరిపిన టెలిఫోన్ సంభాషణ అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్ యుద్ధం (ఫిబ్రవరి 28, 2026) ప్రారంభమైనప్పటి నుండి ఇద్దరు నాయకుల మధ్య జరిగిన తొలి సంభాషణ ఇది. ఈ సంభాషణలో, ఇద్దరూ మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై చర్చించారు. ఆ ప్రాంతంలో స్థిరత్వం అవసరాన్ని స్పష్టం చేశారు.

మరోవైపు, ప్రధానమంత్రి మోదీ ఆ తర్వాత తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు. “అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాను. పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై ఉపయోగకరమైన చర్చలు జరిపాము. ఉద్రిక్తతలను తగ్గించడానికీ, త్వరగా శాంతిని పునరుద్ధరించడానికీ భారతదేశం మద్దతు ఇస్తుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా, అందుబాటులో ఉంచడం ప్రపంచం మొత్తానికి అత్యంత కీలకం. శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలపై మేమిద్దరం సంప్రదింపులు కొనసాగిస్తాము.” అని ప్రధాని మోదీ అన్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, కీలకమైన సముద్ర మార్గాల భద్రతపై క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఆ తర్వాత యుద్ధ వాతావరణం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చలలో భాగంగా, ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న దాడులపై విరామాన్ని మరో 10 రోజుల పాటు, అంటే 2026 ఏప్రిల్ 6, సోమవారం వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ట్రూత్ సోషల్ అనే బ్లాగ్‌లో పోస్ట్ చేస్తూ, ఇరాన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకే ఈ ప్రకటన వెలువడిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని కూడా ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us