క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రజత్ భాటియా

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2020 | 2:18 PM

ఢిల్లీ రంజీ క్రికెటర్, ఐపీఎల్ విజేత రజత్ భాటియా ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు రజత్ భాటియా బుధవారం రోజున ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన రజత్..

క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రజత్ భాటియా
Follow us on

ఢిల్లీ రంజీ క్రికెటర్, ఐపీఎల్ విజేత రజత్ భాటియా ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు రజత్ భాటియా బుధవారం రోజున ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన రజత్..కెరీర్‌లో 137 వికెట్లు పడగొట్టాడు. 6,482 పరుగులు చేశాడు. రంజీ క్రికెట్‌లో తమిళనాడు, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

2008లో రంజీ ట్రోఫీ టైటిల్‌ విజేతగా నిలిచిన జట్టులో రజత్‌ ఉన్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఫైనల్‌లో 139 పరుగులతో అజేయంగా నిలిచాడు. తమిళనాడు తరఫున 1999-2000 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తొలి ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టీమ్‌కు రజత్ భాటియా ప్రాతినిధ్యం వహించాడు.

2012లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ టీమ్(కోల్‌కత్తా నైట్రైడర్స్) టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే పూణే తరపున కూడా ఆడాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 95 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఐపిఎల్ లో తన పదేళ్ళలో రజత్ భాటియా నెమ్మదైన బౌలింగ్ వైవిధ్యాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.