కరోనాను జయించాడు కానీ.. ప్లాస్మా థెరపీ తీసుకున్న డాక్టర్ మృతి..!

ఉత్తరప్రదేశ్‌లో ప్లాస్మా థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తి కన్నుమూశారు. 58ఏళ్ల డాక్టర్ ఆ రాష్ట్రంలో కరోనా కోసం ప్లాస్మా థెరపీ తీసుకోగా.. శనివారం ఆయన గుండెపోటుతో మరణించారు.

కరోనాను జయించాడు కానీ.. ప్లాస్మా థెరపీ తీసుకున్న డాక్టర్ మృతి..!

Updated on: May 10, 2020 | 2:29 PM

ఉత్తరప్రదేశ్‌లో ప్లాస్మా థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తి కన్నుమూశారు. 58ఏళ్ల డాక్టర్ ఆ రాష్ట్రంలో కరోనా కోసం ప్లాస్మా థెరపీ తీసుకోగా.. శనివారం ఆయన గుండెపోటుతో మరణించారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న తరువాత ఆయన పరిస్థితి మెరుగు పరుతూ వచ్చిందని లక్నోలోని ఓ ఆసుపత్రి తెలిపింది. అంతేకాదు శనివారం జరిపిన పరీక్షల్లో సైతం ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.

”ఒరియాకు చెందిన ఓ డాక్టర్ కరోనాతో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. థెరపీ ఇచ్చిన తరువాత ఆయన కాలేయ కండిషన్ మెరుగు పడుతూ వచ్చింది. అయితే అనుకోకుండా ఆయనకు యురినరీలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. అందుకోసం చికిత్స అందించాం. చివరి సారిగా ఆయనకు జరిపిన పరీక్షల్లో సైతం నెగిటివ్‌గా తేలింది. ఆయన భార్యకు కూడా నెగిటివ్ రాగా.. ఆమెను డిశ్చార్జ్ చేశాము” అని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ”ఆయనకు బీపీ, డయాబెటిస్ ఉండటం వల్ల ఐసోలేషన్‌లో చికిత్స అందించాం. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు హార్ట్ ఎటాక్‌ వచ్చింది. మేము ప్రయత్నించినా.. ఆయనను కాపాడలేకపోయాము” అని అక్కడి డాక్టర్ తెలిపారు. కాగా కరోనాతో బాధపడుతున్న వారికి పలుచోట్ల ప్లాస్మా థెరపీని నిర్వహిస్తున్నారు. ప్లాస్మా థెరపీ వలన చాలా మంది కోలుకుంటుండగా.. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

Read This Story also: తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్‌లో నలుగురికి కరోనా..

Loading...
Unable to load recommendations.
Follow Us