కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ తీరుని నిరసిస్తూ.. నిప్పులుచెరిగారు. సర్జికల్ స్ట్రయిక్స్ జరిగింది అనడానికి ఏ ప్రూఫ్ లేదని ఆయన జమ్మూలో రాహుల్ జోడో యాత్రలో భాగంగా వెల్లడించారు. బీజేపీ కేవలం అబద్దాలు చెప్పి పాలిస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. పుల్వామా దాడిపై కేంద్రం ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదని. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేదన్నారు దిగ్విజయ్. దీంతో సర్జికల్ స్ట్రయిక్స్‌పై దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
పార్లమెంట్‌లో కూడా దీనిపై సమాధానం చెప్పలేదని, నివేదిక కూడా ఇవ్వలేదన్నారు. పుల్వామా దాడికి 300 కిలోల RDX ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ , పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య స్నేహాన్ని కూడా ప్రశ్నించారు. దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సైనికుల వీరత్వాన్ని పదేపదే అవమానించడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు బీజేపీ నేత గౌరవ్ భాటియా.సైనికులపై రాహుల్‌కు , దిగ్విజయ్‌కు నమ్మకం లేదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..