డిజిటల్ క్లాసుల నిర్వహణ పై గైడ్ లైన్స్ విడుదల చేసింది స్కూల్ ఎడ్యుకేషన్. 1 నుంచి 5వ తరగతి వరకు వారం లో ఐదు రోజులు క్లాసులు ఉండాలని పేర్కొంది. 6 నుంచి 8వ తరగతి వరకు.. రోజుకు రెండు గంటల టైం లో వారం లో ఐదు రోజులు క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ఇక, 9 నుండి 12 వ తరగతి విద్యార్థులకు రోజుకు మూడుగంటల టైం లో వారం లో ఐదు రోజులు క్లాసులు ఉండాలని మార్గనిర్దేశం చేసింది. Lkg నర్సరీ పిల్లలకు వారం లో మూడు రోజులు క్లాసులు నడపాలని.. అందరూ హెడ్ మాస్టర్స్ ప్రతి రోజు స్కూల్ కి అటెండ్ కావాలని వెల్లడించింది. టిశాట్.. దూర్ దర్శన్ ద్వారా తరగతులు ఉంటాయని చెప్పింది.