Delta Variant: వామ్మో… డెల్టా వేరియంట్ ఎన్ని దేశాలకు వ్యాపించిందో తెలుసా?

|

Jul 01, 2021 | 6:17 PM

Covid-19 Delta Variant: బ్రిటన్‌లో తొలుత గుర్తించిన ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా వేరియంట్ ద్వారా 55 శాతం ఎక్కువగా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌వే ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

Delta Variant: వామ్మో... డెల్టా వేరియంట్ ఎన్ని దేశాలకు వ్యాపించిందో తెలుసా?
Delta Plus Variant
Follow us on

Covid-19 Delta Variant: కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను దడ పుట్టిస్తోంది. తొలిసారిగా భారత్‌లో గుర్తించిన ఈ వేరియంట్ బారినపడిన దేశాల సంఖ్య దాదాపు 100కు చేరింది. ప్రస్తుతం 96 దేశాలకు ఆ వేరియంట్ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. గత వారం రోజుల వ్యవధిలోనే కొత్తగా 11 దేశాల్లోకి ఈ వేరియంట్ వ్యాపించింది. రానున్న మాసాల్లో మరిన్ని దేశాలు డెల్టా వేరియంట్ బారినపడే అవకాశమున్నట్లు కరోనా సంక్షోభానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన ప్రకటనలో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. బ్రిటన్‌లో తొలుత గుర్తించిన ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా వేరియంట్ ద్వారా 55 శాతం ఎక్కువగా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌వే ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. డెల్టా వేరియంట్ వ్యాపించిన దేశాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

రానున్న రోజుల్లో కరోనా కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియింట్ వల్లే సంభవిస్తామని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పురోగమనానికి డెల్టా వేరియంట్ అవరోధంగా మారుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. డెల్టా వేరియంట్‌ను గుర్తిస్తే..స్థానికంగా ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ చేయాల్సిన అవసరముందని సూచించింది. మరీ ముఖ్యంగా వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ రోజుల పాటు కంటైన్మెంట్ చేయాలని సూచించింది. తద్వారా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేయాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఓ కోరింది. డబ్ల్యూహెచ్ఓలో సభ్య దేశాలన్నీ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరింది.

Delta Variant

ఇప్పటి వరకు గుర్తించిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ వైరస్‌లలో…డెల్టా వేరియంట్ అన్నిటికంటే వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్‌గా గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ తాజా గణాంకాల మేరకు..ఆల్ఫా వేరియంట్ ఇప్పటి వరకు 172 దేశాల్లో నమోదుకాగా, బీటా వేరియంట్ 120 దేశాలు, గామా వేరియంట్ 72 దేశాలు, డెల్టా వేరియంట్ 96 దేశాల్లో నమోదయ్యింది.

Also Read..

Delta Plus variant: అలా అయితేనే.. డెల్టా ప్లస్ వేరియంట్‌ను అరికట్టగలం: ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

Third Wave Coronavirus: కరోనా థర్డ్‌వేవ్‌పై ఎలాంటి ఆందోళన చెందవద్దు.. కేంద్ర ఆరోగ్యశాఖ