Delhi Weekend Curfew: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అలజడి సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రతోపాటు దేశరాజధాని ఢిల్లీలో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 నుంచి వీకెండ్ కర్ఫ్యూను విధించింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అన్నిచోట్ల పోలీసులను మోహరించారు. పాస్ లేకుండా రోడ్డుపైకి వచ్చేవారిని వెనక్కి పంపుతున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
వీకెండ్ కర్ఫ్యూ సమయంలో సరైన కారణాలు లేకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని.. వారిని అరెస్టు చేయడంతోపాటు కోర్టులో హాజరుపరుస్తామని శుక్రవారం ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉందని.. కానీ పాస్ లేకుండా బయటకు రావొద్దని సూచించారు. వీకెండ్ కర్ఫ్యూ ఈ పాస్ కోసం https://delhi.gov.in/ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీకెండ్ లాక్‌డౌన్ సందర్భంగా కార్యాలయాలు, మాల్స్, ఆడిటోరియం, రెస్టారెంట్లు, మెట్రో తదితర వాటినన్నింటిని మూసివేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేవారికి పాస్‌లు మంజూరు చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. వీకెండ్ కర్ఫ్యూకు ఒక రోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో శుక్రవారం 19,486 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కేసులు భారీగా నమోదవుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని ఆసుపత్రల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత రావొద్దని సూచించారు. దీంతోపాటు ఎక్కువగా కేసులు నమోదయ్యే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని సూచించారు. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఇంకా కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
Weekend curfew imposed in Delhi till 5am on Monday; all non-essential movement of individuals is prohibited during this period
Checking of vehicles underway at Minto Road pic.twitter.com/i4pk1YrjP3
— ANI (@ANI) April 17, 2021
Also Read: