ఆరుగురు రాక్షసులు.. చింతచచ్చినా బలుపు చావలేదా! ఢిల్లీ పేలుళ్ల కేసులో బయటికొస్తున్న ఉగ్రకోణాలు

లాల్‌ ఖిల్లా బ్లాస్ట్ కేసును తవ్వేకొద్దీ దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ అనుమానితుల్ని, నిందితుల్ని విచారించి వారి నుంచి కూపీ లాగేకొద్దీ విస్తుగొలిపే అంశాలు బైటికొస్తున్నాయి. ఎర్రకోట దగ్గర పేలుడుకు కారణమైన డాక్టర్ల టెర్రర్‌ మాడ్యూల్‌ వెనక పాకిస్తాన్ స్పాన్సర్డ్ జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది.

ఆరుగురు రాక్షసులు.. చింతచచ్చినా బలుపు చావలేదా! ఢిల్లీ పేలుళ్ల కేసులో బయటికొస్తున్న ఉగ్రకోణాలు
Delhi Blast Case

Updated on: Nov 12, 2025 | 10:00 PM

పాకిస్తాన్ రాజనగరం ఇస్లామాబాద్.. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా ఝడుసుకుంది. కోర్టు హాలు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగి.. 12 మంది చచ్చిపొయ్యారన్న వార్త ఆ దేశాన్ని ఎంతసేపు ఏడిపించిందో తెలీదు. ఆ కంట తడి ఆరిందో లేదో అదే పాకిస్థాన్‌లో అదేరోజు ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో IED పేలి 16 మంది పాక్ జవాన్ల శరీరాలు నెత్తురోడాయి. ఇంటాబైటా తీవ్రవాదపు సైతాన్లు ఇలా ఒళ్లంతా తూట్లు పొడుస్తుంటే, ఆ గాయానికి మందుపూసుకుంటూనే, మన మీద కుతంత్రమాడుతోంది దాయాది దేశం. ఔను, మన దేశంలో పాన్ ఇండియా టెర్రర్ ప్లాట్‌కు స్కెచ్చు గీసింది పాకిస్తాన్. ఢిల్లీ చాందినీచౌక్ చౌరస్తాలో కారుబాంబు పేలుడును డీకోడ్ చేస్తే.. ఒక్కటొక్కటిగా ఉగ్రకోణాలు బైటపడుతున్నాయి. ఒక్క ఢిల్లీయే కాదు.. దేశవ్యాప్తంగా వరుసపేలుళ్లకు ప్లాన్లు జరిగినట్టు తెలుస్తోంది. ప్రాణనష్టం వందల్లో కాదు వేలల్లో చూసుకోవాలన్నది లక్ష్యమట. ఏరా, మీకొస్తే నెత్తురు, మాకొస్తే మాత్రం టమోటా చెట్నీనా..? మీవి మాత్రమే ప్రాణాలు మావి ప్రాణాలు కాదా? వైట్ కాలర్ టెర్రర్.. ఇదేనా ఫేస్ ఆఫ్ ది ‘న్యూ జిహాద్’?.. డాక్టర్లు, ప్రొఫెసర్ల వేషంలో టెర్రర్ ముఠాలు ఫరీదాబాద్ యూనివర్సిటీయే అడ్డాగా కుట్రల ట్రెయినింగ్.. వీళ్లందరికీ మేస్త్రీ.. మాస్టర్ మైండ్ ఆఫ్‌ ఆల్ బ్లడ్డీస్… ఆ ఇర్ఫాన్ గాడే.. లక్ష్యమల్లా ఒక్కటే.. పాన్ ఇండియా డెస్ట్రక్షన్! .. వేలల్లో ప్రాణనష్టం 2008 నవంబర్ 26.. నాలుగురోజుల పాటు నాన్‌స్టాప్‌గా 13 చోట్ల బాంబు పేలుళ్లు జరిగితే 175 మంది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి