
ఢిల్లీ, నవంబర్ 12: ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం (నవంబర్ 12) సమావేశం జరిగింది. ఢిల్లీ పేలుడు మృతులకు కేబినెట్ నివాళి అర్పించింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం. దాడులకు సూత్రధారులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు NSA అజిత్ దోవల్‌తో ప్రధాని సమావేశమయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనపై చర్చించారు. పేలుళ్ల మృతులకు నివాళి అర్పించారు.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు ప్రధాని మోదీ. దాడులకు సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. 200 ప్రాంతాల్లో సైన్యం సోదాలు నిర్వహించింది. ఈ రోజు నిర్వహించిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎగుమతులకు రూ.25,060 కోట్ల ప్రోత్సాహకం, ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఖనిజాల అన్వేషణ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ఘటనను ఉగ్రదాడిగా కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఢిల్లీ పేలుడు మృతులకు కేబినెట్ సంతాపం తెలిపింది. రెండు నిమిషాలు మౌనం పాటించిన కేంద్ర కేబినెట్.. ఉగ్రవాదం పై పోరు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.
కాగా నవంబర్ 10 సాయంత్రం 6.52 గంటలకు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన భారీ కారు పేలుడులో 12 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. ఆ కారును హ్యుందాయ్ ఐ20 కారుగా గుర్తించారు. నవంబర్ 12న భూటాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీ LNJP ఆసుపత్రిలో పేలుడులో గాయపడిన వారిని కలిశారు. వైద్యులు, అధికారులు ఆయనకు పరిస్థితి గురించి వివరించారు. ఢిల్లీలో జరిగిన పేలుడు సమయంలో LNJP ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని కలిశాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కుట్ర వెనుక ఉన్న వారు ఎవరైనా వదిలిపెట్టం అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.