Delhi Blast: వామ్మో వీళ్లు డాక్టర్లా..? ఉగ్రవాదులా..? ఇప్పటి వరకు ఆరుగురు వైద్యులు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. ఇప్పుడక్కడ అత్యంత భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే. సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు కానీ, భారీ పేలుడు జరిగినట్లు అర్థమయింది. వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు.

Delhi Blast: వామ్మో వీళ్లు డాక్టర్లా..? ఉగ్రవాదులా..? ఇప్పటి వరకు ఆరుగురు వైద్యులు అరెస్ట్
Delhi Red Fort Blast

Updated on: Nov 11, 2025 | 9:07 PM

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. ఇప్పుడక్కడ అత్యంత భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే. సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు కానీ, భారీ పేలుడు జరిగినట్లు అర్థమయింది. వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ, చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి.

రె-డ్‌పోర్ట్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్‌-1 దగ్గర పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన పదినిమిషాల్లోనే అగ్నిమాపక వాహనాలు స్పాట్‌కు చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే పేలుడు ధాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు. కానీ మంటలు ఆర్పేదాకా తెలియలేదు, ఇది భారీ విధ్వంసమని, ఒకటి, రెండు, మూడు, నాలుగు..అనుకుంటుగానే మరణాల సంఖ్య 8కి చేరింది. 20మందికిపైగా గాయపడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..

13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. బ్లాస్ట్ అయిన ప్లేస్‌ చూస్తే గుండెలు జలదరిస్తాయి. అంత భయానకంగా ఉందా స్పాట్. ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే, ఏదో కుట్ర జరిగే ఉంటుందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో గేట్ -1 దగ్గర ఉన్న ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర రెడ్‌ సిగ్నల్ పడడంతో వెహికిల్స్ ఆగాయి. ఆగిన వెహికిల్స్‌లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియా కావడం, పెద్దగా జనసమ్మర్ధం లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది కానీ, లేకుంటే చరిత్రలో ఊహించని అతిభారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదంటున్నారు అధికారులు.. ఢిల్లీ పేలుళ్ల నేపధ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Nov 2025 07:52 PM (IST)

    UAPA సెక్షన్ అంటే ఏమిటి?

    UAPA – ఉగ్రవాద చట్టంలోని సెక్షన్ 16. ఒక వ్యక్తి సాధారణ ప్రజలలో భయం లేదా భయాన్ని వ్యాప్తి చేసే చర్యకు పాల్పడితే, ఒక వ్యక్తి లేదా సమూహానికి తీవ్రమైన హాని కలిగించే చర్యకు పాల్పడితే, లేదా ప్రభుత్వాన్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే అది ఉగ్రవాద చర్యగా పరిగణించబడుతుంది. దీనికి శిక్ష జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

  • 11 Nov 2025 07:48 PM (IST)

    ఢిల్లీ బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటనపై UAPA సెక్షన్ కేసు నమోదు

    ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్లు 16, 18 కింద, అలాగే పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని అనేక సెక్షన్ల కింద కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.


  • 11 Nov 2025 07:46 PM (IST)

    పేలుడు ప్రదేశంలో 42 వస్తువులను సేకరించిన ఫోరెన్సిక్ టీం

    ఢిల్లీలో పేలుడు జరిగిన ప్రదేశం నుండి సుమారు 42 వస్తువులను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. రేపు ల్యాబ్‌లో వాటికి పరీక్షలు జరపనున్న నిపుణులు. ఈ 42 వస్తువులలో టైర్లు, ఛాసిస్, CNG సిలిండర్, i-20 కారు బానెట్ భాగాలు ఉన్నాయి. ఉపయోగించిన అధిక పేలుడు పదార్థాల రకాన్ని నిర్ణయించడానికి ఫోరెన్సిక్ బృందం ఈ సుమారు 42 వస్తువుల నుంచి స్వాబ్‌లను తీసుకుంది.

  • 11 Nov 2025 07:44 PM (IST)

    ఢిల్లీ పేలుడులో మరణించిన వారికి ఢిల్లీ సర్కార్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన

    ఢిల్లీ పేలుడులో మరణించిన, గాయపడినవారికి ఢిల్లీ సర్కారు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడిన వారికి రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. స్వల్పంగా గాయపడిన వారికి రూ.20,000 అందించనున్నారు. గాయపడిన వారి చికిత్సకు ఢిల్లీ ప్రభుత్వం పూర్తి బాధ్యత చేపట్టిందని, ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం దృఢంగా అండగా నిలుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు.

  • 11 Nov 2025 07:12 PM (IST)

    ఢిల్లీ పేలుడు ఘటన.. ఇప్పటి వరకు ఆరుగురు డాక్టర్లు ఆరెస్ట్!

    ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు దర్యాప్తులో కీలక పరిణామం. అల్ ఫలా యూనివర్సిటీలో పని చేస్తున్న ఆరుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి MBBS కోర్సులు అందిస్తున్న అల్ ఫలా యూనివర్సిటీ లో చదువుతున్నవారిలో 40 శాతం కాశ్మీరీలు ఉండటం విశేషం. అల్ ఫలా యూనివర్సిటీలోనే ఎర్ర కోట కారు పేలుడు పాల్పడిన డాక్టర్ ఉమర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

    ఎర్ర కోట కారు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు ప్రాధమిక దర్యాప్తు నివేదిక అందజేశారు. జైష్ ఏ మహమ్మద్ ఉగ్ర సంస్థకు ఫరీదాబాద్ డాక్టర్లకు ఉన్న సంబంధాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల దర్యాప్తు అంశాలను జోడిస్తూ ఎర్ర కోట కారు పేలుడు ఘటనపై హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక అందజేశారు. ఇప్పటికే ఎర్ర కోట కారు పేలుడు కేసును హోంశాఖ NIA కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

  • 11 Nov 2025 06:06 PM (IST)

    ఢిల్లీ కారు పేలుడు ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య

    దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరింది. 20 మందికిపైగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కేంద్రం మాత్రం దీనిని ఉగ్రచర్యగా భావించి ముమ్మర దర్యాప్తు చేపట్టింది. పేలుడుకు బాధ్యులైన వారు ఎవరైనా తప్పించుకోలేరని, తప్పక శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటన జారీ చేశారు.

    సోమవారం రాత్రి 7 గంటలకు ముందు పేలుడు సంభవించింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న హ్యుందాయ్ i20 కారు పేలింది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలిన కారు సమీపంలో ఇతర వాహనాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సోమవారం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ మరో నలుగురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.

  • 11 Nov 2025 05:26 PM (IST)

    నిన్న సాయంత్రం కారు పేలడానికి 3 గంటల ముందు జరిగిందిదే..!

    ఢిల్లీ కారు పేలుడు జరగడానికి మూడు గంటల ముందు హ్యుందాయ్ i20 తెలుపు రంగు కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేయబడింది. ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు పార్క్ చేసి ఉంది. మూడు గంటల తర్వాత 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరినట్లు గుర్తించారు. కారు వెళ్లే సమయంలో పార్కింగ్ స్థలం చాలా రద్దీగా ఉంది. ప్రస్తుతం కారులోకి ఎవరు ప్రవేశించారు? ఎవరు పార్క్ చేశారు? దానిని తీసుకెళ్లడానికి ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

  • 11 Nov 2025 04:52 PM (IST)

    ఆ యూనివర్సిటీలో ఉగ్రవాద నెట్‌వర్క్‌పై సోదాలు కొనసాగిస్తున్నాం.. హర్యానా డీజీపీ

    అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ ప్రాంగణం అంతటా సోదాలు జరుగుతున్నాయి. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ దర్యాప్తు కొనసాగుతుందని హర్యానా డీజీపీ వెల్లడించారు. విశ్వవిద్యాలయంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను కూడా దర్యాప్తు చేస్తున్నారు. మేము ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, కేంద్ర సంస్థలతో నిరంతరం సహకరిస్తున్నామని తెలిపారు.

  • 11 Nov 2025 04:47 PM (IST)

    పేలిన కారులో దొరికిన ఆ శరీర భాగాలు ఎవరివి?

    జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ నబీ ఈ పేలుడులో కీలకంగా వ్యవహరించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రతోనూ ఇతడికి సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నాయి. పేలుడుకు కారణమైన కారులో దొరికిన వ్యక్తి శరీర భాగాలను ఉమర్‌వా? కావా? అనేది తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎన్‌ఏ నమూనాల కోసం అతడి తల్లి షమీమా బేగంను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

  • 11 Nov 2025 04:42 PM (IST)

    కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. NIA చేతికి ఉగ్రకుట్ర కేసు

    ఢిల్లీలో భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. సాధారణంగా ఎన్‌ఐఏ ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తుంది. దీంతో తాజా ఘటనను కేంద్రం ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.

  • 11 Nov 2025 04:35 PM (IST)

    మరో మహిళా డాక్టర్‌ అరెస్టు..

    ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా డాక్టర్‌ను అధికారులు అరెస్టు చేశారు. సహరన్‌పుర్‌కు చెందిన డాక్టర్‌ పర్వేజ్‌ అన్సారీ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్‌ ఉగ్రకుట్రలోని డాక్టర్‌ ఆదిల్‌తో ఈమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  • 11 Nov 2025 04:06 PM (IST)

    ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో లేడీ డాక్టర్‌..

    ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్‌ షాహిన్‌ వెనుక ఏకంగా జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

  • 11 Nov 2025 04:03 PM (IST)

    పరారీలో ఉన్న ఉమరే బాంబరా?

    ఉమర్‌ కి ఇతరులతో ఉన్న పరిచయాలపై కూడా ఫరీదాబాద్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమర్‌, ముజమ్మిల్‌ కదలికలను తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్‌తో పేలుడుకు పాల్పడేందుకు వారిద్దరూ కలిసి ఢిల్లీలో పర్యటించారా..? లేదా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్ర కుట్ర చేధించిన తర్వాత నుంచి పరారీలో ఉన్న ఉమరే బాంబర్ కావొచ్చని అనుమానిస్తున్నారు.

  • 11 Nov 2025 04:00 PM (IST)

    డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి అందుకేనా? తెరపైకి మరో సంచలనం

    అరెస్ట్‌ అయిన డాక్టర్లలో అదీల్‌ అహ్మద్ అనే వాడు.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేశాడు. ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌ ఒకేదగ్గర పనిచేసేవారు. ఆమెది లక్నో. గత మూడు సంవత్సరాలుగా అల్‌ ఫలాహ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ అండ్ రీసెర్చ్‌ సెంటర్‌లో ముజమ్మిల్‌ సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో ఉమర్ కూడా పనిచేస్తున్నాడు. ఫరీదాబాద్‌లో పోలీసులు చేపట్టిన భారీ తనిఖీలు, తన సహచరుడు షకీల్‌ అరెస్ట్‌తో తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు దాదాపు 800 మంది పోలీసులు వచ్చినట్లు సమాచారం. అయితే ఆ భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

  • 11 Nov 2025 03:57 PM (IST)

    సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ కూడా ఓ డాక్టరే..

    గుజరాత్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరులను గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం. ఈ పరిణామాల వేళ ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన సహచరుల అరెస్ట్, బాంబు తయారీలో వాడే పేలుడు పదార్థాల స్వాధీనంతో నిరాశ చెందిన అతడు ఈ పేలుడుకు పాల్పడి ఉండొచ్చన్న కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

  • 11 Nov 2025 03:28 PM (IST)

    48 గంటల్లో ఐదుగురి డాక్టర్ల హస్తం..!

    ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది (Delhi Blast). ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు నడుపుతోన్న వ్యక్తి డాక్టర్ ఉమర్‌ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్ర కుట్రల్లో భాగమైన వారిలో ఏకంగా ఐదుగురు వైద్యులు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ ఘటనను మంత్రులు, అధికారులు దీనిని ఉగ్ర ఘటనగా పేర్కొన్నప్పటికీ.. చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద దర్యాప్తు చేస్తున్నారు.

  • 11 Nov 2025 03:26 PM (IST)

    కశ్మీర్‌లో తీగలాగితే.. ఫరీదాబాద్‌లో కదిలిన డొంక

    నిషేధిత జైషే మహ్మద్, అన్సార్‌ గజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేసినట్లు సోమవారం జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్‌ షాహిన్‌ సోమవారం లఖ్‌నవూలో అరెస్టు కాగా ఆమె కారు నుంచి ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపారు.

  • 11 Nov 2025 03:24 PM (IST)

    ఫరీదాబాద్‌లోనే పేలుడు.. కానీ ఇతర రాష్ట్రాల్లోనూ ముమ్మర సోదాలు

    ఉగ్రకుట్ర దర్యాప్తు పరిధి ఫరీదాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు. నిఘా సమాచారం ఆధారంగా ఫరీదాబాద్ కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా హర్యానా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్ని హై అలర్ట్‌లో ఉంచిన దర్యాప్తు బృందాలు. ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న తర్వాత, దర్యాప్తును ఫరీదాబాద్‌కు మాత్రమే పరిమితం చేయలేదని, దర్యాప్తు పరిధిని విస్తరించామన్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఉత్తర ప్రదేశ్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని అన్నారు.

  • 11 Nov 2025 03:17 PM (IST)

    అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్రవాద నెట్‌వర్క్‌.. అనుమానితుల అరెస్టులు

    ప్రస్తుతం అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ ప్రాంగణం అంతటా సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దర్యాప్తు బృందం అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను కూడా దర్యాప్తు చేస్తున్నారు. మేము ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, కేంద్ర సంస్థలతో నిరంతరం సహకరిస్తున్నాము. ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా హర్యానా పోలీసులు వెంటనే దాడులకు సహాయం చేస్తున్నారు. కేంద్ర సంస్థల నుండి మాకు నిరంతరం నిఘా సమాచారం అందుతోందని దర్యాప్తు బృందం వెల్లడించింది.

  • 11 Nov 2025 03:06 PM (IST)

    ఉగ్రవాదంలోకి మహిళలు.. గ్యాంగ్‌ పెద్దదే!

    ఫరీదాబాద్‌లో అరెస్టయిన డాక్టర్ షహీనా.. జైష్-ఏ-మహ్మద్ మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తుంది. నిజానికి జమాత్-ఉల్-మోమినాత్ అనేది జైష్ మహిళా విభాగం. దీనికి భారతదేశ కమాండర్ బాధ్యతలు డాక్టర్ షహీనా గుప్పిట్లో ఉన్నాయి. పాకిస్తాన్‌లోని జైష్ మహిళా విభాగానికి సాదియా అజార్ నాయకత్వం వహిస్తుంది. సాదియా అజార్ జైష్ చీఫ్ మసూద్ అజార్ సోదరి. సాదియా అజార్ భర్త యూసుఫ్ అజార్, కాందహార్ హైజాక్‌లో ప్రధాన సూత్రధారి.

  • 11 Nov 2025 03:03 PM (IST)

    డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపై ATS దాడి.. ఇంటికి తాళం వేసి పర్వేజ్ పరార్

    జైష్-ఏ-మహ్మద్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న డా పర్వేజ్ ఇంటిపై యూపీ ATS ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత పర్వేజ్ పరారీలో ఉండటం విశేషం. UP ATS, జమ్మూకశ్మీర్‌ పోలీస్ బృందం పర్వేజ్ ఇంటిని గుర్తించి చేరుకుంది. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పాటు పర్వేజ్ పరారైనాడు. దీంతో పర్వేజ్ ఇంటి డోర్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్లిన UP ATS, J&K పోలీస్ బృందాలు సోదాలు చేస్తున్నాయి.

    డాక్టర్ పర్వేజ్ అన్సారీకి డాక్టర్ ముజమ్మిల్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముజమ్మిల్ సమాచారం ఆధారంగా ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

  • 11 Nov 2025 02:53 PM (IST)

    డా షాహీన్ షాహిద్, డా ఉమర్.. వీరిద్దరూ ఆ యూనివర్సిటీ సిబ్బందే!

    ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హర్యాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలువురు యూనివర్సిటీ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వర్సిటీలో కొందరిని అదుపులోకి తీసుకున్న బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఈ యూనివర్సిటీలోనే డా షాహీన్ షాహిద్, డా ఉమర్ పనిచేస్తున్నారు. ఆత్మాహుతి బాంబర్‌గా మారి కారును పేల్చేసిన డా ఉమర్. ఫరీదాబాద్‌లోని అల్ఫాలా విశ్వవిద్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

    వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం పోలీసులు డాక్టర్ ఉమర్ నవి గదితో పాటు మొదటి అంతస్తులోని అన్ని గదులను సోదా చేశారు. ఆరు నుంచి ఎనిమిది మంది విశ్వవిద్యాలయ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదుపులోకి తీసుకున్న వారిలో విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులు, వైద్యులు ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారందరినీ పోలీసులు కఠినంగా విచారిస్తున్నారు.

  • 11 Nov 2025 02:47 PM (IST)

    ఉగ్రవాద చర్యల్లో ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ..

    ఉగ్రవాద చర్యల్లో ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. పలువురు ఉగ్రవాదులకు అడ్డాగా మారిన యూనివర్సిటీ.  యూనివర్సిటీలోని ల్యాబ్‌లను పేలుడు పదార్థాలపై ప్రయోగాలకు వినియోగించినట్టు దర్యాప్తు సంస్థల అనుమానం వ్యక్తం చేశాయి. RDX, ఇతర అడ్వాన్స్‌డ్ మెటీరియల్‌పై పరీక్షలు నిర్వహించి ఉంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • 11 Nov 2025 01:43 PM (IST)

    మరో వైద్యుడు అరెస్ట్

    జైష్-ఏ-మహ్మద్ కార్ బాంబ్ పేలుడు కేసు:

    మరో వైద్యుడిని అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందాలు

    పుల్వామాకు చెందిన డా. సాజద్ అహ్మద్ మల్లా అరెస్ట్

    పీజీ మెడిసిన్ చదువుకున్న డా. సాజద్ అహ్మద్ మల్లా

  • 11 Nov 2025 01:16 PM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్‌లో కశ్మీరీ డాక్టర్లే ప్రధాన నిందితులు

    ఢిల్లీ బ్లాస్ట్‌లో కశ్మీరీ డాక్టర్లే ప్రధాన నిందితులు

    నిన్న అరెస్టైన ఏడుగురు నిందితుల్లో ముగ్గురు డాక్టర్లు

    డా. ఆదిల్‌ అహ్మద్‌, డా.ముజమ్మీల్‌, డా.షహీనా అరెస్ట్‌

    జేషే మహిళా విభాగం చీఫ్‌గా ఉన్న డా. షహీనా, లక్నో వాసి

    ఫరీదాబాద్‌లో డాక్టర్‌ షహీనా కారు నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం

    నిన్న మొత్తం 2900 కిలోల IED మెటీరియల్‌ స్వాధీనం

    ఫరీదాబాద్‌ నుంచి పేలుడు పదార్ధాలతో పరారైన డా.ఉమర్‌

    నిన్న రోజంతా ఢిల్లీలోనే కారులో చక్కర్లు కొట్టిన డా.ఉమర్‌

    అందరూ దొరికిపోవడంతో ఆత్మహుతి దాడికి పాల్పడాలని నిర్ణయం

    సాయంత్రానికి ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడి

    మొత్తం 12కి పెరిగిన మృతులు, 17మందికి గాయాలు

  • 11 Nov 2025 12:15 PM (IST)

    కుట్రదారులను వదిలిపెట్టం: ప్రధాని మోదీ

    రెండ్రోజుల పర్యటన కోసం భూటాన్ వెళ్లిన ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. భూటాన్‌కు, భూటాన్ రాజకుటుంబానికి, ప్రపంచ శాంతిని విశ్వసించే వారందరికీ ఈ రోజు చాలా ముఖ్యమైన రోజంటూ పేర్కొన్నారు. భారతదేశం – భూటాన్ శతాబ్దాలుగా లోతైన భావోద్వేగ మరియు సాంస్కృతిక బంధాన్ని పంచుకున్నాయన్నారు. అందువల్ల, ఈ ముఖ్యమైన సందర్భంలో పాల్గొనడం భారతదేశం నిబద్ధత అన్నారు. కానీ ఈ రోజు తాను చాలా బరువైన హృదయంతో ఇక్కడికి వచ్చానని.. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ తీవ్రంగా బాధపెట్టిందన్నారు. బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు మొత్తం దేశం వారితో నిలుస్తుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో నిన్న రాత్రంతా సంప్రదించాను.. మా ఏజెన్సీలు ఈ కుట్ర మూలాన్ని కనుగొంటాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోమంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • 11 Nov 2025 11:50 AM (IST)

    ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడి..?

    ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.. కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్‌దిగా గుర్తించారు. నిన్న కారులో ఉన్నది డా.ఉమర్‌గా ప్రాథమికంగా నిర్ధారించారు. డా.ఉమర్‌ పుల్వామాకు చెందిన వ్యక్తి .. అని.. శ్రీనగర్‌లోని MD మెడిసిన్స్‌ కాలేజీ, GMC అనంతనాగ్‌లో పనిచేసినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అల్ఫాలా ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.. గత నెలలో అమీర్ పేరుమీద వాహనాన్ని కొనుగోలు చేసిన డా.ఉమర్.. అదే వాహనాన్ని పేలుడుకోసం వాడినట్లు పేర్కొంటున్నారు.

  • 11 Nov 2025 11:36 AM (IST)

    12కి చేరిన మృతుల సంఖ్య..

    ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్‌ కారులో బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  • 11 Nov 2025 11:27 AM (IST)

    కాసేపట్లో ఢిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష

    కాసేపట్లో ఢిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష

    కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో సమీక్ష

    కేంద్ర హోం కార్యదర్శి, డైరెక్టర్ ఐబీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్..

    ఎన్ఐఏ డీజీతో సమీక్షించనున్న అమిత్‌ షా

    సమావేశంలో వర్చువల్‌గా హాజరుకానున్న జమ్ము కశ్మీర్ డీజీపీ

  • 11 Nov 2025 11:04 AM (IST)

    ఢిల్లీ కారు పేలుడు కేసులో అరెస్టులు

    ఢిల్లీ కారు పేలుడు కేసులో అరెస్టులు

    జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్

    అమీర్ రషీద్ మిర్ (27), ఉమర్ రషీద్ మిర్(30)

    తారిఖ్‌ మాలిక్ (44) కశ్మీర్‌ వ్యాలీలో అరెస్టు చేసిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు.

    అంతేకాదు మరో 13మంది అనుమానితులు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.

  • 11 Nov 2025 11:00 AM (IST)

    ఢిల్లీ కారు పేలుడు ఘటనపై FIR నమోదు

    ఢిల్లీ కారు పేలుడు ఘటనపై FIR నమోదు

    రెడ్‌ఫోర్ట్ పోలీస్ పోస్ట్ SI వినోద్ నయన్ స్టేట్మెంట్ ఆధారంగా కేసు

    పేలుడు సమయంలో పోలీస్ పోస్టులోనే ఉన్న ఎస్సై వినోద్

    పేలుడు శబ్దం విన్న తర్వాత బయటికొచ్చి చూసిన ఎస్సై

    మంటల్లో తగలబడుతున్న వాహనాలు చూసినట్టు ఫిర్యాదు

    వెంటనే సీనియర్ అధికారికి, కంట్రోల్ రూమ్‌కు సమాచారం

    పోలీస్ పోస్టులో సిబ్బందితో వెంటనే సహాయ చర్యలు

  • 11 Nov 2025 10:32 AM (IST)

    శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రత పెంపు..

    ఢిల్లీలో బ్లాస్ట్ తర్వాత.. శంషాబాద్‌ విమానాశ్రయంలో రాత్రి నుంచే భద్రతను పెంచారు. CISFతోపాటు.. సీఆర్పీఎఫ్‌, లోకల్‌ పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్ళే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఎయిర్పోర్ట్ అధికారులు. అంతేకాదు భద్రతా బలగాలను మరింత పెంచారు ఎయిర్పోర్ట్ అధికారులు.

  • 11 Nov 2025 10:04 AM (IST)

    ఢిల్లీ పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

    ఢిల్లీ పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

    అప్రమత్తం చేసిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవిషన్ సెక్యూరిటీ

    విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లు, వైమానిక దళ స్టేషన్లు..

    హెలిప్యాడ్‌లు, ఫ్లయింగ్ స్కూల్‌లు, ఏవియేషన్ శిక్షణా సంస్థల్లో అలర్ట్‌

    భద్రతా చర్యలు పెంచాలని ఆదేశాలు

    విమానాశ్రయాల్లో అన్ని CCTVలు పనిచేసేలా చూసుకోవాలన్న BCAS

    డ్రోన్‌లు, మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్టులపై తాత్కాలిక నిషేధం

    ఎయిర్ అంబులెన్స్‌తో సహా, అన్ని విమానాల్లో కఠినంగా పర్యవేక్షణ

  • 11 Nov 2025 09:33 AM (IST)

    ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ JeM ఉగ్రవాదులకు లింకు ఉన్నట్లు అనుమానం

    ఉగ్రదాడి కోణంలోనే విచారణ జరుపుతున్న సంస్థలు

    ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ JeM ఉగ్రవాదులకు లింకు ఉన్నట్లు అనుమానం

    ఇటీవలే పట్టుబడ్డ డా.ముజ్జమిల్‌, డా.ఆదిల్

    వారి నుంచి భారీగా IED పేలుడు పదార్థాలు స్వాధీనం

    2500 కేజీల అమోనియం నైట్రేట్‌ స్వాధీనం

    ఆ ఇద్దరితో డా.ఉమర్‌కు లింకులు ఉన్నట్లు అనుమానం

    డా.ఉమర్‌ కూడా అమోనియం నైట్రేట్‌తో కారులో ఉన్నట్లు అనుమానాలు

    ఘటనా స్థలంలో రాత్రి నుంచి FSL అధికారుల తనిఖీలు

    బ్లాస్ట్‌ సైట్‌ దగ్గర నిందితుడి DNA నమూనాల సేకరణ

    DNA పరీక్ష జరిపి డా.ఉమరా? కాదా? అనే విషయాన్ని తేల్చనున్న అధికారులు

  • 11 Nov 2025 09:29 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడిగా అనుమానం

    ఢిల్లీ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడిగా అనుమానం

    బ్లాస్ట్‌ కేసులో తొలి అరెస్ట్‌ చేసిన NIA

    పుల్వామాకు చెందిన తారీఖ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు

    కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్‌దిగా గుర్తింపు

    డా.ఉమర్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా అనే అనుమానం

    నిన్న బ్లాక్‌ మాస్క్‌తో కారులో ఉన్నది డా.ఉమరేనా?

    అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న NIA, ఢిల్లీ పోలీసులు

    బ్లాస్ట్‌కు అమోనియం నైట్రేట్‌ను వినియోగించినట్లు అనుమానం

  • 11 Nov 2025 09:15 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    బాంబు పేలుడుపై లోక్ నాయక్ ఆసుపత్రిలో ఢిల్లీ పోలీస్ కమిషనర్, అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు అమిత్‌షా. అనంతరం చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • 11 Nov 2025 09:00 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    ఢిల్లీ బాంబు పేలుడుపై తెలుగు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పేలుడుపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

  • 11 Nov 2025 08:45 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    పేలుడు జరిగిన కారు నుంచి ఆధారాలు సేకరించి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపింది ఫోరెన్సిక్ బృందం. ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అమిత్‌షాకు ఫోన్‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • 11 Nov 2025 08:30 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసి తారిక్‌గా గుర్తించారు. NSG కమాండోలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • 11 Nov 2025 08:15 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర CCTV ఫూటేజీ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి దర్యాప్తు బృందాలు.

  • 11 Nov 2025 08:00 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    పేలుడులో అమోనియం నైట్రేట్‌ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్‌ అయినట్టు గుర్తించిన పోలీసులు.. కారు యజమానిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

  • 11 Nov 2025 07:45 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    బాంబు పేలుడు తీవ్రతకు మృతదేహాలు తునాతునకలై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. 10 వాహనాలు, పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

  • 11 Nov 2025 07:30 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్ టాప్ – 9

    ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్‌ కారులో బాంబు పేలింది. పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడిన వారికి LNJP ఆసుపత్రికి తరలించారు.

  • 11 Nov 2025 07:20 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడిగా అనుమానం

    ఢిల్లీ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడిగా అనుమానం

    బ్లాస్ట్‌ కేసులో తొలి అరెస్ట్‌ చేసిన NIA

    పుల్వామాకు చెందిన తారీఖ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు

  • 11 Nov 2025 06:52 AM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం..

    ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం..

    డెత్‌ స్పాట్‌లో ఆధారాలు సేకరిస్తున్న FSL బృందాలు

    నిన్న రాత్రి జరిగిన కారు పేలుడులో 9 మంది మృతి

    ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర CCTV ఫుటేజ్‌ స్వాధీనం

  • 11 Nov 2025 06:49 AM (IST)

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష

    నేడు ఎర్రకోట కారు పేలుడు ఘటనపై సమీక్ష నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    భద్రతా సంస్థల అధిపతులతో సమావేశం కానున్న అమిత్ షా

    సమావేశంలో పాల్గొననున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, అంతర్గత భద్రతకు సంబంధించిన అధికారులు

    కారు పేలుడు ఘటనపై ప్రాథమిక దర్యాప్తు వివరాలను అమిత్ షా కి తెలపనున్న అధికారులు

  • 11 Nov 2025 06:26 AM (IST)

    మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించింది: అమిత్‌షా

    ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణనష్టం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించింది.

    మృతుల కుటుంబాలకు సానుభూతి

    పేలుడు స్థలాన్ని సందర్శించాను.. ఆసుపత్రిలో గాయపడిన వారిని కూడా కలిశాను.

    గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను

    ఘటనపై అగ్రశ్రేణి సంస్థలు పూర్తి తీవ్రతతో దర్యాప్తు చేస్తున్నాయి

    -కేంద్ర హోంమంత్రి అమిత్ షా

  • 11 Nov 2025 06:12 AM (IST)

    ఢిల్లీ పేలుడుతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌

    ఢిల్లీ పేలుడుతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌

    ఈరోజు హోంమంత్రి అమిత్‌షా కీలక సమావేశం

    హాజరుకానున్న హోంశాఖ సీనియర్‌ అధికారుల బృందం

    ఢిల్లీ బ్లాస్ట్‌తో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌.. విస్తృత తనిఖీలు

    కేంద్ర హోంశాఖ అలర్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లోనూ అలర్ట్‌

    హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతిలో చెకింగ్స్‌

  • 11 Nov 2025 12:43 AM (IST)

    వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను..

    ఢిల్లీ పేలుడు ఘటనపై రాష్ట్రపతి ముర్ము స్పందించారు. ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  • 11 Nov 2025 12:03 AM (IST)

    ఆ కారు అతనిదే..?

    HR26 CE 7674 నంబర్ ప్లేట్ కలిగిన i20 అసలు యజమాని మొహమ్మద్ సల్మాన్ అరెస్టును హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు ధృవీకరించారు. అయితే, సల్మాన్ తాను కారును జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి విక్రయించానని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత తారిక్ ఆ కారును మూడవ పక్షానికి తిరిగి విక్రయించాడా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది.

  • 10 Nov 2025 11:48 PM (IST)

    i20 కారు కొన్న పుల్వామాకు చెందిన వ్యక్తి

    సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలి ఎనిమిది మంది మృతి చెందగా, 20 మంది గాయపడిన హర్యానా నంబర్ ప్లేట్లు కలిగిన హ్యుందాయ్ i20 కారు జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగినట్లు గుర్తించినట్లు పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత అధికార వర్గాలు తెలిపాయి.

  • 10 Nov 2025 11:33 PM (IST)

    బీహార్‌లో హై అలర్ట్‌..

    నవంబర్ 11(మంగళవారం)న జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశకు ముందు, సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత బీహార్ పోలీస్ ATS హై-అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది.

  • 10 Nov 2025 11:30 PM (IST)

    ఐ20 కారులో పేలుడు.. కారు ఓనర్‌ అరెస్ట్‌!

    ఎర్రకోట ఎదురుగా ఉన్న ఐ20 కారులో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గురుగ్రామ్‌లో కారు యజమాని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తాను హ్యుందాయ్ ఐ20 అమ్మేశానని అతను తెలిపాడు.

  • 10 Nov 2025 11:26 PM (IST)

    ఢిల్లీ పేలుడు.. అమెరికా స్పందన!

    ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడులో 8 మంది మృతి చెందిన ఘటనపై స్పందిస్తూ.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అమెరికా తెలిపింది.
    ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోరమైన బాంబు పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడిన నేపథ్యంలో అమెరికా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, కాన్సులర్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు గురించి తెలిసింది. మేం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం, కాన్సులర్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

  • 10 Nov 2025 10:58 PM (IST)

    వారి కోసం ప్రార్థించండి: బీజేపీ చీఫ్‌

    న్యూఢిల్లీలో జరిగిన విషాదకరమైన కారు పేలుడులో ప్రాణనష్టం బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహాయం చేరేలా అధికారులు చూస్తున్నారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జెపి నడ్డా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  • 10 Nov 2025 10:20 PM (IST)

    పేలుడు బాధితులకు అండగా ఉంటాంః ప్రధాని మోదీ

    ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు . పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో తన సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “పేలుడు బాధిత వారికి అధికారులు సహాయం అందిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించారు” అని ఆయన అన్నారు.

  • 10 Nov 2025 10:19 PM (IST)

    క్షతగాత్రులను పరామర్శించిన అమిత్ షా

    పేలుడు ఘటనపై  కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటనలో కొంతమంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు అమిత్ వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సమీపంలోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.