Rare case of black fungus: దేశంలో ఓ వైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ మహమ్మారి కూడా అలజడి సృష్టిస్తోంది. కరోనాతోపాటు.. బ్లాక్ ఫంగస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా కళ్లపై దాడి చేసే బ్లాక్ ఫంగస్.. పేగులకు కూడా వ్యాపిస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఇద్దరు రోగుల చిన్న ప్రేగులలో బ్లాక్ ఫంగస్‌ను గుర్తించినట్లు సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు శనివారం వెల్లడించారు.
ఇప్పటివరకూ నమోదైన కేసులల్లో ఇవే అరుదైన బ్లాక్ ఫంగస్ కేసులని వైద్యులు ప్రకటించారు. 56, 48 ఏళ్ల రోగులల్లో ఈ కేసులు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ సమస్య వచ్చిన రోగులు కోవిడ్ -19 నుంచి కోలుకున్నారని, డయాబెటిస్ కూడా ఉందని వైద్యులు ప్రకటించారు. కానీ ఒకరికి మాత్రమే స్టెరాయిడ్లు వచ్చినట్లు తెలిపారు.
56ఏళ్ల రోగికి కొన్ని క్రితం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన భార్య కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకింది. అనంతరం కొన్ని రోజులకు రోగికి పొత్తికడుపులో నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన అనంతరం అన్ని పరీక్షలు చేయగా.. చిన్న ప్రేగులకు బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అప్పటికే చికిత్స మూడు రోజులపాటు ఆలస్యమైందని వైద్యులు ప్రకటించారు. ఇద్దరికీ ప్రస్తుతం చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
Also Read: