Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై కోర్టులో విచారణ శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ..

|

Nov 21, 2022 | 7:44 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో శరత్‌చంద్రారెడ్డి,బినోయ్‌బాబులకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు లిక్కర్‌ స్కాంపై సీబీఐ , ఈడీ ఇచ్చే అధికార ప్రకటనలు తప్ప ఇతర వార్తలను వేయరాదని ఢిల్లీ హైకోర్టులు మీడియా సంస్థలను ఆదేశించింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై కోర్టులో విచారణ శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ..
Delhi Liquor Scam
Follow us on

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీ ముగియడంతో వారిని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. . బినోయ్‌ బాబు, శరత్‌ చంద్రారెడ్డిలకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అభ్యర్ధన మేరకు ఇద్దరికి 14 రోజుల జ్యుడిషియిల్‌ కస్టడీ విధించింది. అయితే జైల్లో ఇద్దరికి ఇంటి భోజనం అందించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా తగిన వైద్యసాయం కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. జైలులో బినోయ్‌ బాబుకు వాటర్‌ఫ్లాస్క్‌, ఇంటి భోజనం, రెండు జతల బట్టలు, ఘూస్‌ వంటి వాటిని అనుమతించింది. అలాగే శరత్‌ చంద్రారెడ్డికి ఇంటి భోజనం తోపాటు, క్రోనిక్‌ బ్యాక్‌ పెయిన్‌ వైద్య చికిత్స, హైపర్‌ టెన్షన్‌ మందులు, ఉలెన్‌ బట్టలు, ఘూస్‌ వంటి వాటికి కోర్టు అనుమతించింది.తదుపరి విచారణను అవెన్యూ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది.

మీడియాకు ఎలాంటి లీక్‌లు ఇవ్వలేదన్న ఈడీ..

మరోవైపు లిక్కర్‌ స్కాంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్‌ మీడియా కన్వీనర్‌ విజయ్‌నాయర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సీబీఐ , ఈడీ సంస్థలు మీడియాకు లీక్‌లు ఇస్తున్నాయని ఈ పిటిషన్‌లో విజయ్‌నాయర్‌ పేర్కొన్నారు. అయితే తాము మీడియాకు ఎలాంటి లీక్‌లు ఇవ్వలేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు . మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధం లేదని, లిక్కర్‌ స్కాంపై తాము మూడు స్టేట్‌మెంట్లు ఇచ్చినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది.

ఐదు ఛానెళ్ల తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లిక్కర్‌ స్కాంలో వార్తలపై వివరణ ఇవ్వాలని ఆ ఛానెళ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ ఇచ్చే అధికార ప్రకటనలను మాత్రమే ప్రసారం చేయాలని ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం