ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఢిల్లీ కోర్టు బుధవారం (సెప్టెంబర్ 11) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. అదే సమయంలో ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆప్ నేతకు బెయిల్ మంజూరైంది.
తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర నిర్బంధంలో ఉన్న వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపించిన కుంభకోణంలో అక్రమ సొమ్ముతో ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందిందని సీబీఐ ఆరోపించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ED అరెస్టు చేసింది. దీని తరువాత, జూలైలో, ఈ ఆరోపించిన కుంభకోణంలో సిఎం కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది. కాగా, మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేసిన సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జులై 12న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది . అయితే సీబీఐ అరెస్టు కేసులో ఆయన ఇంకా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. అంతకుముందు ఆగస్టు 27న, ఆపై సెప్టెంబర్ 3న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 11 వరకు పొడిగించారు. ఇప్పుడు మళ్లీ అతను సెప్టెంబర్ 25 వరకు కస్టడీలో ఉండాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..