Delhi Airport: ఆ విమానాన్ని పేల్చేస్తాం.. ఢిల్లీ విమానాశ్రయానికి బెదిరింపులు.. అలెర్ట్..

|

Sep 11, 2021 | 1:06 PM

Security Alert: బాంబు బెదిరింపులతో ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికాలో 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని

Delhi Airport: ఆ విమానాన్ని పేల్చేస్తాం.. ఢిల్లీ విమానాశ్రయానికి బెదిరింపులు.. అలెర్ట్..
Delhi Airport
Follow us on

Security Alert: బాంబు బెదిరింపులతో ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికాలో 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామంటూ గురువారం రాత్రి అనామక వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతోపాటు శుక్రవారం ఉదయం కూడా ఢిల్లీ విమానాశ్రయంపై బాంబులతో దాడి చేసి తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు.

మొదట లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామంటూ రహోలా పోలీస్ స్టేషన్ కు బెదిరింపు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంపై దాడి చేస్తామని పేర్కొనడంతో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సౌత్ వెస్ట్ డీసీపీ ప్రతాప్ సింగ్ తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి వెళ్లేవారు తొందరగా బయలుదేరాలని.. ఈ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ట్విట్ చేశారు. బాంబు బెదిరింపు కాల్ రాత్రి ఢిల్లీలోని రహోలా పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని.. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ట్వీట్లో తెలిపారు. ఫ్లైట్ ఎక్కాల్సిన వారు ఆలస్యం చేయకుండా ముందుగా రావాలని ప్రయాణికులకు సూచించారు. బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో అన్ని ప్రాంతాలను భద్రతాధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Also Read:

Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

Crime News: చెల్లిని దారుణంగా చంపిన అన్న.. వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని.. తుపాకీతో..