
జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రవాద నుంచి ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
వీరు కనిపిస్తే వెంటనే పోలీసులకు చెప్పండి
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలీసుల అలర్ట్ పోస్టర్లలో ఢిల్లీకి చెందిన అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) చెందిన ఉగ్రవాది మహమ్మద్ రెహాన్ ఫోటోను పోలీసులు తొలిసారిగా చేర్చారు. ఏఎన్‌ఐ ప్రకారం ఇతను ఢిల్లీ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నాడు. ఈ పోస్టర్లలో కనిపిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులు ఢిల్లీ నగరం సహా రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.
CCTV, 10000వేల మంది పోలీస్ సిబ్బందితో పర్యవేక్షణ
ఇక ఉద్రదాడి హెచ్చరికల నేపథ్యంలో గణతంత్ర వేడుకలు జరిగే కర్తవ్య పథ్ సహా నగర వ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనిపై న్యూ ఢిల్లీ జిల్లా అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కుమార్ మహాలా మాట్లాడుతూ.. కర్తవ్య పాత్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా వలయాన్ని అమర్చారని తెలిపారు. “మొత్తం ప్రాంతం విస్తృత CCTV కెమెరాల నెట్‌వర్క్ ద్వారా పర్యవేక్షణలో ఉంది, ఇది అధునాతన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)తో ఇంటిగ్రేట్ చేయబడింది, అని ఆయన అన్నారు. అలాగే, వేడుకల కోసం సుమారు 10,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారని, ఇప్పటికే తొమ్మిది ఆన్-గ్రౌండ్ బ్రీఫింగ్‌లు నిర్వహించారని ఆయన తెలిపారు.
వైమానిక నిఘా కోసం ప్రత్యేక డ్రోన్స్
అలాగే వైమానిక నిఘా కోసం యాంటీ-డ్రోన్ యూనిట్లను, ఎత్తైన భవనాలపై స్పిపర్ బృందాలను ఉంచామన్నారు. ఈ ముప్పులను ఎదుర్కోవడానికి, జిల్లా అంతటా హోటళ్ళు, అతిథి గృహాలు, అద్దెభవనాలు, గృహ సహాయకు ఇంటెన్సివ్ వెరిఫికేషన్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. వేడుకల సమయంలో పాదచారులకు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMDలు) ద్వారా కనీసం స్టేజ్‌ల స్క్రీనింగ్ పరీక్షల తర్వాతే అనుమతిస్తామన్నారు.
వీటిని తీసుకెళ్లడం నిషేదం
భద్రతా కారణాల దృష్ట్యా, బ్యాగులు, బ్రీఫ్‌కేసులు, ఆహార పదార్థాలు, మొబైల్ ఫోన్‌లు కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు, పవర్ బ్యాంకులు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పదునైన వస్తువులు, మండే పదార్థాలు, గొడుగులు, పరిమళ ద్రవ్యాలు, బొమ్మ ఆయుధాలు లేదా ఏదైనా పేలుడు పదార్థాలను ఎన్‌క్లోజర్‌ల వేడుకల ప్రాంగణంలోకి తీసుకెళ్లడం నిషేధించినట్టు తెలిపారు. నగరంలో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా, ఎవరైనా అనుమానంగా కనిపించినా వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందికి లేదా 112 కు కాల్ చేయాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.