Delhi Rains: వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు.. ముగ్గురు మృతి

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీ మినహా నగరంలో అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం ఓ భారీ భవనం కూలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Delhi Rains: వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు.. ముగ్గురు మృతి
Delhi Heavy Rains

Edited By:

Updated on: Jul 09, 2026 | 8:20 PM

దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సెంట్రల్ ఢిల్లీ మినహా నగరంలో అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలోని రోహిణి భవనం కూలి ముగ్గురు చనిపోయారు,పలువురికి గాయాలయ్యాయి. అనేక ప్రాంతాల్లో గోడలు కూలిపోవడం, వృక్షాలు నేలకూలడం, రోడ్లు కుంగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. ప్రధాన రహదారులపై మోకాళ్ళ లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ బేస్ స్టేషన్‌లో గత 24 గంటల్లోనే మి.మీ ,తుఖ్మీర్‌పూర్ లో 160మి.మీ , మెహ్రౌలీ లో 83 మి.మీ ,లోధి రోడ్ లో 79 మి.మీ,పూసాలో 73 మి.మీ ,మయూర్ విహార్ లో 66 మి.మీ వర్షపాతం నమోదైంది..

అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం

మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలు దేశ రాజధానిలో రాకూడదని ఢిల్లీ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. వర్షాలు ప్రారంభమైన రెండో రోజే ఢిల్లీ సీఎం రంగంలోకి దిగారు. వర్షాల పరిస్థిని సమీక్షించేందుకు సీఎం రేఖా గుప్తా వెళ్లి శాలీమార్ విలేజ్ తదితర లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థలను, పంపింగ్ కేంద్రాలను పరిశీలించారు. నిలిచిన నీటిని వేగంగా తొలగించాలని,సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ సైతం ఐటీఓ లోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి నీటిని తోడేసే పనులను పర్యవేక్షించారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి నీటిని వేగంగా తొలగించేందుకు అదనపు పంపులను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.నగర మున్సిపల్ కార్పొరేషన్, జల్ బోర్డు,విపత్తు నిర్వహణ బృందాలతో పాటు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను అప్రమత్తం అయ్యాయి. సీసీ కెమెరాలతో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తు రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ప్రజలకు వెంటనే సహాయక చర్యలు అందించేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణ సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని, చెట్ల కింద, పాత భవనాల వద్ద నిలబడరాదని మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరికొద్ది రోజులపాటు కొనసాగనున్న వర్షాలు

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో దేశంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ,హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు..వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us