ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు(Ratan Tata) భారతరత్న ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) నిరాకరించింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించేందుకు అర్హమైనది కాదని పేర్కొంది. కాబట్టి అలాంటి ఉత్తర్వు ఇవ్వలేమని స్పష్టం చేసింది. రతన్ టాటాకు అవార్డును ప్రదానం చేయాలని ప్రభుత్వాన్ని ‘కనీసం అభ్యర్థించాలని’ పిటిషనర్ కోరారు. రతన్ టాటా దేశానికి సేవ చేస్తున్నారని అందుకే భారతరత్న స్వీకరించేందుకు ఆయన అర్హుడని వాదించారు. పిటిషనర్ వాదనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఖర్చులతో పాటు పిటిషన్(Petition) ను కొట్టివేస్తామనిహెచ్చరించడంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటాకు 2008లో పద్మవిభూషణ్, భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం – 2000లో పద్మభూషణ్, మూడో-అత్యున్నత పౌర పురస్కారం – 2000లో లభించాయి. అయితే ఆటా అభిమానులు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో, టాటా తన అనుచరులను ఇటువంటి ప్రచారాలను నిలిపివేయాలని కోరారు.
అవార్డు విషయంలో సోషల్ మీడియాలో ఒక వర్గం వ్యక్తం చేసిన మనోభావాలను నేను అభినందిస్తున్నాను, అలాంటి ప్రచారాలను నిలిపివేయమని నేను విన్నపంగా వేడుకున్నాను. నేను భారతీయుడిగా మరియు భారతదేశ అభివృద్ధికి ప్రయత్నించడం, సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
– రతన్ టాటా, ప్రముఖ పారిశ్రామికవేత్త
Also Read
Viral Video: ఇతడి ఆవిష్కరణకు.. మంత్రి కేటీఆర్ ఫిదా..! స్ప్రింగులతో ఇలా కూడా చేయొచ్చా.?
anand mahindra: “ఇట్స్ మ్యాజికల్” .. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న సీన్.. ఎస్ అంటున్న నెటిజనం..
ఫేస్ కట్స్ తో సహా గుర్తుపట్టలేనట్టు మారిపోయిన తెలుగు ముద్దుగుమ్మ మీరా జాస్మిన్