Air Pollution: పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ లేకపోతే నో పెట్రోల్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..

|

Oct 01, 2022 | 6:47 PM

వాయు కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంధన వినియోగం రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువుతోంది. దీంతో కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు....

Air Pollution: పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ లేకపోతే నో పెట్రోల్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..
No Puc No Petrol
Follow us on

వాయు కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంధన వినియోగం రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువుతోంది. దీంతో కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా వాయు కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం, తాజాగా ‘నో పీయూసీ – నో ఫ్యూయల్‌’ని అమలు చేయనుంది. దీంతో ఇకపై వాహనాలకు పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ లేకపోతే పెట్రోల్‌ బంకుల్లో ఫ్యూయల్‌ పోయడానికి అనుమతి ఇవ్వడం కుదరదని తెలిపింది.

ఈ విషయమై ఢిల్లీ పర్యావారణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్‌ 25 నుంచి పెట్రోల్‌ బంకుల్లో పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ చూపిస్తేనే పెట్రోల్‌, డీజిల్‌ ఇచ్చే విధానంలో అమల్లోకి రానుందని తెలిపారు. పర్యావరణ, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి వాహన కాలుష్యం కూడా ఒకటని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఇందులో భాగంగానే ఎక్కువ కాలుష్యాన్ని వదిలే వాహనాలు రోడ్లపై తిరగకుండా నిరోధించే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానంపై ఈ ఏడాది మార్చిలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నామని, మెజారిటీ దీని అమలుకు ఓకే చెప్పడంతోనే ఈ విధానం తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు. మరి ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న ఈ కొత్త విధానంలో ఏమేర ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..