మేడమ్ గారి చెప్పులు ధర రూ.4.9 కోట్లు.. అంత కాస్ట్లీ ఎందుకబ్బా అంటారా..? ఇదే రీజన్
ఏంటి చెప్పులు ధర రూ.4.9 కోట్లా..? ఏంటి వాటిని బంగారంతో చేశారు అనుకోకండి. దాని వెనుక వేరే బాగోతం ఉంది. ఇదిగో వివరాలు...
డ్రగ్స్ మహమ్మారి మన దేశంలో యువతను పట్టి పీడిస్తుంది. వారి భవిష్యత్‌ను అంధకార మయం చేస్తుంది. ఎంతో సాధించాల్సిన యువతీ యువకులు.. ఈ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఊహల లోకాలలో బతుకుతున్నారు. మన దేశంలో యువత ప్రపపంచలోని ఏ దేశంలో కూడా లేరు. వారిని ఈ డ్రగ్స్ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ డ్రగ్ పెడ్లర్స్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి స్కెచ్చులతో రెచ్చిపోతున్నారు. పోలీసులు, నార్కోటిక్స్ అధికారులకు చిక్కికుండా ఈ మాయదారి డ్రగ్స్‌ను బోర్డర్స్ దాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలుమార్లు చిక్కి జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా కొందరు ఇదే దందాను కొనసాగించండం గమనార్హం.
తాజాగా చెప్పుల్లో కొకైన్‌ను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ మహిళను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె చెప్పుల్లో నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. గురువారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రవర్తనలో తేడా రావడంతో.. సదరు మహిళను అడ్డగించిన అధికారులు.. ఆమె లగేజ్ చెేస్తే ఏం లభించలేదు. అనంతరం వెరైటీగా ఉన్న ఆమె చెప్పులతో పోలీసుల ఫోకస్ పడింది. వాటిని చెక్ చేయగా లోపల కొకైన్ ప్యాకెట్లు కనిపించాయి. దీంతో ఆ మహిళను అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పర్చగా న్యాయూర్తి జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
#WATCH | Mumbai Airport Customs on September 29 intercepted a pax carrying 490 grams of cocaine worth Rs 4.9 crore ingeniously concealed in a special cavity made in her sandal. Pax arrested & remanded to judicial custody: Customs pic.twitter.com/SfgX0Uvx25
— ANI (@ANI) October 1, 2022
దేశంలో పెచ్చుమీరుతున్న గంజాయి వినియోగం…
ఇలా డ్రగ్స్ దొరికే కేసులు కొన్నే.. ఇక రోడ్డు, వాయు, జల మార్గాల ద్వారా ఏ రేంజ్‌లో మత్తు పదార్థాల రవాణా అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇక గంజాయి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. రోజుకు వందల సంఖ్యలో దేశంలో గంజాయి వాడకం, రవాణాకు సంబంధించి కేసులు నమోదవుతున్నారు. ఈ మత్తు పదార్థాలను కూకటి వేళ్లతో పెకిలించకపోతే.. మన యువత భవిష్యత్‌కు, తద్వారా మన దేశ భవిష్యత్‌కు పెను ప్రమాదం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..