Political Challenge: అటు మంత్రి.. ఇటు ఉపముఖ్యమంత్రి.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. సందర్శనకు సై అంటూ..

|

Dec 17, 2020 | 8:38 AM

ఆయనేమో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆధిత్యనాథ్‌ సర్కార్‌లో విద్యాశాఖ మంత్రి.. ఈయనమో దేశ రాజధాని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌లో ఉపముఖ్యమంత్రి..

Political Challenge: అటు మంత్రి.. ఇటు ఉపముఖ్యమంత్రి.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. సందర్శనకు సై అంటూ..
Follow us on

ఆయనేమో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆధిత్యనాథ్‌ సర్కార్‌లో విద్యాశాఖ మంత్రి.. ఈయనమో దేశ రాజధాని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌లో ఉపముఖ్యమంత్రి.. ఇద్దరి మధ్య ప్రస్తుత సవాళ్లు.. ప్రతిసవాళ్ల పర్వం నడుస్తోంది. ఇంతకీ ఏంటా సవాళ్లు.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2022లో యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేస్తుందంటూ ప్రకటించింది. యూపీలో అభివృద్ధి కొరవడిందని, ఆమ్‌ ఆద్మీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రకటించారు. దీనికి ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సతీష్ ద్వివేది తీవ్రంగా స్పందించారు. యోగి నేతృత్వంలో యూపీ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ విద్యా విధానాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ద్వివేది సవాల్ విసిరారు. అయితే, ఈ సవాల్‌కు మనీశ్ సిసోడియా కూడా అంతే స్పీడ్‌గా స్పందించారు. తాడు యూపీలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించేందుకు వచ్చే వారం లక్నో వెళ్లననున్నట్లు ప్రకటించారు.

 

సవాల్‌ను స్వీకరిస్తున్నా..

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మనీశ్ సిసోడియా.. యూపీ మంత్రి ద్వివేది సవాల్‌ను స్వీకరిస్తున్నానని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు కల్పించిన మౌలిక సదుపాయాలపై చర్చించేందుకు తాను సిద్ధం అన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్‌ స్కూళ్లలో ఏమేం చేశారో చూసేందుకు వచ్చే వారం అక్కడికి వెళ్తానని తెలిపారు. ‘గత నాలుగేళ్లలో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన 10 స్కూళ్ల జాబితా తయారు చేయాలి. ఎక్కడ అభివృద్ధి పలితాలు వచ్చాయి.. పోటీ పరీక్షల్లో పిల్లలు ఏయే పరీక్షలు రాశారు.. ఈ స్కూళ్లలో మీరు ఏమేం చేశారు.’ అనేవి తాము పరిశీలిస్తామని సిసోడియా చెప్పుకొచ్చారు. కాగా, యూపీలో ఆమ్ ఆద్మీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్య, విద్యుత్ అంశాలపై చర్చ మొదలు పెట్టిందంటూ సిసోడియా ఎద్దేవా చేశారు.

 

Also Read:

గుంటూరు జిల్లా అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై బోల్తాపడ్డ ట్రావెల్ బస్సు.. 40 మంది ప్రయాణీకులకు గాయాలు

ఉస్మానియా యూనివర్సిటీ రికార్డు… కరోనా కాలంలోనూ తరగతుల నిర్వహణ… పరీక్షలు… ఫలితాలు….